పది సెషన్ల పాటు సాగిన పసిడి ధరల పతనానికి బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా ట్రెండ్స్ పటిష్టంగా ఉండటం, స్థానికంగా డిమాండ్ నెలకొనడంతో సోమవారం పుత్తడి రేట్లు మళ్లీ పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,500 పెరిగి రూ. 1,26,800కి చేరింది.
అదే బాటలో వెండి కూడా కోలుకుంది. కేజీకి రూ. 2,000 పెరగడంతో ధర రూ. 1.57 లక్షలకు చేరుకుందని స్థానిక ట్రేడర్లు తెలిపారు. అంతర్జాతీయంగా మెరుగైన ట్రెండ్స్‌తో పాటు పెళ్లిళ్ల సీజన్‌లో ఆభరణాలకు డిమాండ్ బాగుంటుందనే అంచనాలతో పసిడి ధర పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు.
ఇటీవలి కరెక్షన్ కారణంగా బంగారం ఆకర్షణీయంగా మారిందని ఆయన పేర్కొన్నారు. అటు అంతర్జాతీయంగా మార్కెట్లో బంగారం ధర ఔన్సుకి 5 శాతం (170 డాలర్లు) పెరిగి 3,690 డాలర్లకు, వెండి 7 శాతం పెరిగి 43.66 డాలర్లను తాకింది.
ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోందా?.. బంగారం, వెండి కొంటున్న కియోసాకి!


