26 ఏళ్ల తర్వాత పునరాగమనం
త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం
న్యూఢిల్లీ: స్వదేశీ బ్రాండ్, ఆరెంజ్ సాఫ్ట్ డ్రింక్ ‘గోల్డ్ స్పాట్’ దాదాపు 26 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఆరోగ్యంపై వినియోగదారులకు పెరుగుతున్న శ్రద్ధకు అనుగుణంగా ఈసారి ‘లో–షుగర్’ లేదా ‘షుగర్–ఫ్రీ’ రూపంలో త్వరలో రీ–లాంచ్ చేసేందుకు కోకా–కోలా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
పాత తరం వినియోగదారులను ఆకట్టుకునేలా దీని పాత ట్యాగ్‌లైన్ ‘‘ది జింగ్ థింగ్’’ను కొనసాగించే యోచనలో కంపెనీ ఉంది. 1971లో గోల్డ్ స్పాట్‌ను 1993లో థమ్స్ అప్, లిమ్కా, మాజా బ్రాండ్లతో పాటు కోకా–కోలా కొనుగోలు చేసింది. అయితే, తన సొంత ఆరెంజ్ డ్రింక్ ‘ఫాంటా’కు పోటీగా మారడంతో 2000 సంవత్సరంలో గోల్డ్ స్పాట్ విక్రయాలను నిలిపివేసింది.
తాజాగా రిలయన్స్ ‘క్యాంపా’ నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని తట్టుకునేందుకు కోకా–కోలా ఈ వ్యూహాత్మక అడుగు వేస్తోంది. మాజీ క్రికెట్ కెపె్టన్ ఎంఎస్ ధోనీ ఫొటో ఉన్న ‘గోల్డ్ స్పాట్’ క్యాన్ ఫోటో ఆయన భార్య ‘సాక్షి’ ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేయడంతో, ఈ బ్రాండ్‌కు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 2025–26లో రూ.1.40 లక్షల కోట్లుగా ఉన్న దేశీయ నాన్–ఆల్కహాలిక్ బెవరేజెస్ మార్కెట్ 2030–31 నాటికి రూ.2.56 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.


