డెబిట్‌ లావాదేవీల నిలిపివేతకు ‘స్టాప్‌ స్విచ్‌’ | RBI proposes Stop Switch to block all outgoing payments | Sakshi
Sakshi News home page

డెబిట్‌ లావాదేవీల నిలిపివేతకు ‘స్టాప్‌ స్విచ్‌’

Nov 24 2026 4:39 AM | Updated on Nov 24 2026 4:39 AM

RBI proposes Stop Switch to block all outgoing payments

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ లావాదేవీలను సురక్షితంగా మార్చడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు తమ బ్యాంకు ఖాతాలపై మరింత నియంత్రణనిచ్చే విధంగా ’స్టాప్‌ స్విచ్‌’ ఫీచరును బ్యాంకులు అందించాలని ప్రతిపాదించింది. ఖాతా నుంచి డెబిట్‌ లావాదేవీలన్నింటినీ నిలిపివేసే విధంగా ఇది ఉండాలని ముసాయిదా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఎల్రక్టానిక్‌ బ్యాంక్‌ లావాదేవీలను (ఈబీటీ) సురక్షితంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. 

ప్రస్తుతం కొనసాగుతున్న రుణ వాయిదాలు, ఇతరత్రా చెల్లింపులు మొదలైన వాటిని స్టాప్‌ స్విచ్‌ పరిధి నుంచి మినహాయించవచ్చని పేర్కొంది. ఒక్కసారి దీన్ని యాక్టివేట్‌ చేసిన తర్వాత కస్టమర్‌ స్వయంగా తలపెట్టిన డెబిట్‌ లావాదేవీలు గానీ కొత్త పేమెంట్‌ ఆదేశాలు గానీ పనిచేయవు. కొత్త స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇవ్వడానికి వీలుండదు. అయితే కస్టమర్‌ ఖాతాల్లోకి జమలపై దీని ప్రభావమేమీ ఉండదు. కస్టమర్‌ ధ్రువీకరించాకే స్టాప్‌ స్విచ్‌ను బ్యాంకు డీయాక్టివేట్‌ చేయాల్సి ఉంటుంది. మోసపూరిత లావాదేవీల విషయంలో ’బ్యాంకు నిర్లక్ష్యం’ నిర్వచన పరిధిని ఆర్‌బీఐ విస్తరించింది. ఈ మార్గదర్శకాలపై డిసెంబర్‌ 14 వరకు ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉంటుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement