వాట్సాప్‌ వారి... గెస్ట్‌ కాలింగ్‌ | WhatsApp introduced a guest-calling feature, without WhatsApp account | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ వారి... గెస్ట్‌ కాలింగ్‌

Oct 23 2026 12:32 AM | Updated on Oct 23 2026 12:32 AM

WhatsApp introduced a guest-calling feature, without WhatsApp account

టెక్‌ టాక్‌

ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ‘గెస్ట్‌ కాలింగ్‌’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. వాట్సాప్‌ ఎకౌంట్‌ లేకపోయినా ఎవరైనా ఈ కొత్త ఫీచర్‌ ద్వారా వాయిస్‌–వీడియో కాల్స్‌లో చేరవచ్చు. యాప్‌లోని కాల్స్‌ ట్యాబ్‌ నుండి కాల్‌ ఇన్విటేషన్‌ను సులభంగా క్రియేట్‌ చేయవచ్చు. ప్లస్‌ ఐకాన్‌ నొక్కి, కాల్‌ లింక్‌ జనరేట్‌ అయిన తరువాత మీరు ఇన్వైట్‌ చేయదల్చుకున్న గెస్ట్‌లకు షేర్‌ చేయాలి. 

షేర్‌ చేసిన లింక్‌ను ఉపయోగించి కంప్యూటర్‌ బ్రౌజర్‌ ద్వారా కూడా ఆహ్వానితులు కాల్‌లో చేరవచ్చు. వాట్సాప్‌ ఎకౌంట్‌ లేని వ్యక్తి కాల్‌లో చేరినప్పుడు హోస్ట్‌ అనుమతించేవరకు వేచి ఉండాలి. హోస్ట్‌ అనుమతించే వరకు వారు వర్చువల్‌ వెయిటింగ్‌ రూమ్‌లో ఉంటారు.

పాల్గొన్నవారి ఫోన్‌ నంబర్‌లను చెక్‌ చేయడం, మెసేజ్‌లు పంపడం, ఇతర సభ్యులను కాల్‌కు ఆహ్వానించడం గెస్ట్‌లకు కుదరదు. సంభాషణల సమయంలో తమ స్క్రీన్‌ను షేర్‌ చేయడం, ఇమోజీలతో స్పందించడం, ప్రశ్నలు అడగడానికి చేతులు పైకెత్తడం లాంటివి చేయవచ్చు. కాల్‌ నియంత్రణ హోస్ట్‌ చేతిలో ఉంటుంది. గెస్ట్‌ను ఏ సమయంలోనైనా తొలగించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement