రూపాయికి ‘ఆర్‌బీఐ’ రక్షణ | Rupee rallies 93 paise to six-month high after RBI curbs speculation | Sakshi
Sakshi News home page

రూపాయికి ‘ఆర్‌బీఐ’ రక్షణ

Oct 13 2026 5:27 AM | Updated on Oct 13 2026 5:27 AM

Rupee rallies 93 paise to six-month high after RBI curbs speculation

ఒక్కరోజే 93 పైసలు పెరిగిన దేశీయ కరెన్సీ; 95.78 వద్ద క్లోజ్‌

6 నెలల్లో అతిపెద్ద ర్యాలీ

ముంబై: రూపాయి పతనాన్ని అరికట్టేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రంగంలోకి దిగడంతో సోమవారం దేశీయ కరెన్సీ బలంగా పుంజుకుంది. డాలర్‌ మారకంలో ఏకంగా 93 పైసలు బలపడి 95.78 వద్ద ముగిసింది. గడిచిన ఆరు నెలల్లో రూపాయి ఒకే రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. గతంలో 2026 ఏప్రిల్‌ 2న ఒక్కరోజే 166 పైసలు ఎగసింది. ఫారెక్స్‌ మార్కెట్లో ఉదయం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 95.61 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 

ఇంట్రాడేలో 95.57 వద్ద గరిష్టాన్ని, 95.96 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. రూపాయి క్షీణతను అరికట్టే చర్యల్లో భాగంగా విదేశీ మారక ద్రవ్య డెరివేటివ్స్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ నిబంధనలను కఠినతరం చేసింది. రూపాయి మారకంతో ముడిపడిన డెలివరబుల్, నాన్‌–డెలివరబుల్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులను రద్దు చేసిన తర్వాత తిరిగి బుక్‌ చేసుకోవడానికి అనుమతించవద్దని అ«దీకృత డీలర్‌ బ్యాంకులను ఆదేశించింది.

 అలాగే 2 మిలియన్‌ (20 లక్షల) డాలర్లకు పైబడిన డాలర్‌ కొనుగోళ్ల కోసం బ్యాంకులు తప్పనిసరిగా 20% ‘రిజర్వు’ను కేటాయించాలని సూచించింది. ముడి చమురు దిగుమతి కంపెనీల డాలర్‌ అవసరాల కోసం నిర్దేశిత బ్యాంకుల ద్వారా ప్రత్యేక ‘డాలర్‌ విండో’ను ఏర్పాటు చేసింది. వీటితో పాటు కొన్ని విదేశీ మారక ద్రవ్య హెడ్జింగ్‌ లావాదేవీల వ్యయాన్ని పెంచింది. ఆర్‌బీఐ చర్యలు స్పాట్‌ మార్కెట్‌లో డాలర్లకు ఉండే తక్షణ డిమాండ్‌ను తగ్గించేందుకు దోహదపడతాయని ఫారెక్స్‌ ట్రేడర్లు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement