ఆరు వారాల గరిష్టానికి రూపాయి  | Indian Rupee jumps to 94.50 against US dollar, hits six-week high | Sakshi
Sakshi News home page

ఆరు వారాల గరిష్టానికి రూపాయి 

Oct 22 2026 1:27 AM | Updated on Oct 22 2026 1:27 AM

Indian Rupee jumps to 94.50 against US dollar, hits six-week high

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ 53 పైసలు బలపడి ఆరు వారాల గరిష్ట స్థాయి 94.38 వద్ద ముగిసింది. రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫారమ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ కోసం విదేశీ నిధులు భారీగా తరలిరావడం, డాలర్‌ డిమాండ్‌ను నియంత్రించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జోక్యం చేసుకోవడం రూపాయి బలపడేందుకు దోహదపడ్డాయి. 

అయితే, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పుంజుకోవడం, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ పతనం రూపాయి లాభాలను కొంతమేర పరిమితం చేశాయని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒకదశలో 94.35 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. భారీ ఐపీఓల్లో పాల్గొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లను విక్రయించి రూపాయలను సమీకరించడంతో దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్ల లభ్యత పెరిగిందని లెమన్‌ బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫామ్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌ గార్గ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement