బంగారం ధరలకు కీలకం.. ఆ మూడు రోజులే! | Gold Price Outlook 3 US Events in November-December 2026 Crash or Rally | Sakshi
Sakshi News home page

బంగారం ధరలకు కీలకం.. ఆ మూడు రోజులే!

Nov 23 2026 9:39 PM | Updated on Nov 23 2026 9:47 PM

Gold Price Outlook 3 US Events in November-December 2026 Crash or Rally

రికార్డు స్థాయిలకు చేరిన తర్వాత బంగారం ధరల్లో భారీ దిద్దుబాటు కనిపిస్తోంది. దీంతో ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేయాలా? మరికొంత తగ్గిన తర్వాత పెట్టుబడి పెట్టాలా? అనే సందిగ్ధంలో ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో అమెరికా నుంచి వెలువడే మూడు కీలక ఆర్థిక పరిణామాలు బంగారం తదుపరి దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

తాజా ధరల గణాంకాల ప్రకారం.. నవంబర్ 23న దేశీయంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,26,560గా ఉంది. నెల రోజుల్లోనే 10 గ్రాములపై సుమారు రూ.16,200 మేర ధర తగ్గింది. ఈ పతనం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినా, ధరలు మరింత పడిపోతాయా అన్న ఆందోళన కొనసాగుతోంది.

నవంబర్ 25: అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు

మొదటి కీలక పరిణామం నవంబర్ 25న వెలువడనున్న అమెరికా పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్స్ (PCE) ద్రవ్యోల్బణ నివేదిక. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయానికి ఈ సూచీకి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా నమోదైతే వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు తగ్గవచ్చు. దీంతో డాలర్ బలపడటం, బంగారం ధరలపై ఒత్తిడి పెరగడం సాధ్యమవుతుంది. ద్రవ్యోల్బణం తగ్గితే మాత్రం బంగారానికి మద్దతు లభించవచ్చు.

డిసెంబర్ 4: అమెరికా ఉద్యోగ గణాంకాలు

రెండో కీలక అంశం డిసెంబర్ 4న విడుదలయ్యే అమెరికా నవంబర్ నెల ఉద్యోగ నివేదిక. కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? నిరుద్యోగిత రేటు ఎంత ఉంది? వేతనాల పెరుగుదల ఎలా ఉంది? వంటి అంశాలు ఇందులో వెల్లడవుతాయి. ఉద్యోగ కల్పన బలంగా ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందనే సంకేతాలు వెలువడతాయి. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం కొనసాగించవచ్చనే అంచనాలు పెరిగి బంగారంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. బలహీనమైన ఉద్యోగ గణాంకాలు వెలువడితే మాత్రం బంగారం ధరలు పుంజుకునే అవకాశం ఉంటుంది.

డిసెంబర్ 9: ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం

మూడింటిలో అత్యంత కీలకమైనది డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన సమావేశం. డిసెంబర్ 9న వడ్డీ రేట్లపై నిర్ణయం, ఫెడ్ ఛైర్మన్ వ్యాఖ్యలు వెలువడనున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం అదే రోజు విడుదలయ్యే ప్రకటన భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 10 తెల్లవారుజామున అందుబాటులోకి వస్తుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారానికి సానుకూల వాతావరణం ఏర్పడవచ్చు. రేట్లను యథాతథంగా కొనసాగించడం లేదా భవిష్యత్తులో తగ్గింపులపై కఠిన సంకేతాలు ఇవ్వడం జరిగితే ధరలు మళ్లీ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.

దేశంలోని ప్రధాన నగరాలలో నేటి (నవంబర్‌ 23) బంగారం, వెండి ధరలు ఈ కింద చూడొచ్చు..

gold1
1/7

gold2
2/7

gold3
3/7

gold4
4/7

gold5
5/7

gold6
6/7

gold7
7/7

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement