అమెరికా కంపెనీలపై రష్యా దాడులు.. కోకాకోలా ప్లాంట్ ధ్వంసం | Coca Cola plant destroyed in Russian attacks on US companies | Sakshi
Sakshi News home page

అమెరికా కంపెనీలపై రష్యా దాడులు.. కోకాకోలా ప్లాంట్ ధ్వంసం

Oct 14 2026 6:28 PM | Updated on Oct 14 2026 6:51 PM

Coca Cola plant destroyed in Russian attacks on US companies

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీల స్థావరాలు దెబ్బతిన్నాయి. ప్రముఖ దిగ్గజ కంపెనీ కోకాకోలా ప్లాంట్ ధ్వంసం కాగా, మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ గిడ్డంగిపై కూడా దాడి జరిగింది. అంతేకాదు పెప్సికో ఉత్పత్తి కేంద్రం కూడా దెబ్బతిన్నట్లు సదరు సంస్థ వెల్లడించింది.

ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. సెప్టెంబర్‌ ప్రారంభంలో కీవ్‌ సమీపంలోని కోకాకోలా ప్లాంట్‌ రష్యా డ్రోన్‌ దాడిలో ధ్వంసమైంది. సెప్టెంబర్‌ 25న కీవ్‌ ప్రాంతంలోని మెక్‌డొనాల్డ్స్‌ గిడ్డంగిపై దాడి జరగడంతో సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని రెస్టారెంట్లు కార్యకలాపాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. గత ఏడాది ఆగస్టులో మైకొలైవ్‌లోని పెప్సికో ఉత్పత్తి కేంద్రం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.

అమెరికా కంపెనీలపై దాడులు జరుగుతున్నప్పటికీ ట్రంప్‌ ప్రభుత్వం బహిరంగంగా ఖండించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో అమెరికా వ్యాపార సంస్థలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇన్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఆండీ హండర్‌ పేర్కొన్నారు. ఈ దాడులపై చర్చించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌లతో సమావేశం కావాలని కోరినా స్పందన రాలేదన్నారు. ఇదీలా ఉండగా మరోవైపు యుద్ధాన్ని ముగించి శాంతి ఒప్పందం కుదిరేలా అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తోందని వైట్‌హౌస్‌ తెలిపింది.

అయితే దెబ్బతిన్న ప్రతి సంస్థను అమెరికా యాజమాన్యం కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని  సదరు కథనం పేర్కొంది. 

ఇదీ చదవండి: పరువు నష్టం కేసు.. ట్రంప్ డిపాజిషన్ వాయిదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement