అమెరికాకు రత్నాభరణాల ఎగుమతులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో మళ్లీ టారిఫ్‌లను పెంచితే పరిస్థితి తలకిందులవుతుందని పరిశ్రమ ఆందోళన చెందుతోంది. టారిఫ్‌లను ఏమాత్రం పెంచినా లేదా అక్కడి మార్కెట్లోకి ప్రవేశంపై అనిశ్చితి ఏర్పడినా మన ఎగుమతులు పోటీపడలేని పరిస్థితి ఉంటుందని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు.
భారత్ నుంచి దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించాలని, ఒకవేళ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే వాటిని 17 శాతానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీజేఈపీసీ ఆందోళన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా టారిఫ్‌ల వల్ల దేశీయంగా రత్నాభరణాల పరిశ్రమ సుదీర్ఘకాలం అనిశి్చతితో సతమతమైందని భన్సాలీ చెప్పారు.
దాదాపు 2,00,000కు పైగా ఉద్యోగాలకు ఊతమిస్తూ అమెరికా అతి పెద్ద జ్యుయలరీ మార్కెట్‌గా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. టారిఫ్‌ల పెంపు వల్ల అక్కడ భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి, వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గుతుందని, ఫలితంగా ఇరు దేశాల్లోనూ ఉద్యోగాలు, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని భన్సాలీ చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరి, టారిఫ్‌ల భారం తగ్గుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బంగారం కల్తీ.. ఆఫర్ల మాయలో పడొద్దు


