breaking news
Threat
-
ఏఐకి కళ్లెం వేయకపోతే మానవాళికి ముప్పు తప్పదా..?
మనం సృష్టిస్తున్న టెక్నాలజీ... రేపు మనల్నే మింగేయబోతోందా? నిన్నటి దాకా అద్భుతాలు చేసిన ఏఐ... రాబోయే రోజుల్లో మానవాళి మనుగడకే ముప్పుగా మారనుందా..? అవును, ఇది బయటి వ్యక్తులు చెబుతున్న మాట కాదు... ఆ ఏఐకి ప్రాణం పోస్తున్న సృష్టికర్తలే వణుకుతూ చేస్తున్న హెచ్చరిక..!ఏ టెక్నాలజీ గురించి అయితే ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకుంటోందో... ఇప్పుడు అదే టెక్నాలజీ చూసి టెక్ దిగ్గజాలు ఎందుకు భయపడుతున్నాయి..? ఇంతకీ కృత్రిమ మేధతో పొంచి ఉన్న ఆ పెను ప్రమాదం ఏంటి..? ఏఐకి కళ్లెం వేయకపోతే మానవాళికే ముప్పు' అంటూ టెక్ ప్రపంచం ఎందుకు గగ్గోలు పెడుతోంది..? ఈ సంచలన పరిణామాల వెనుక అసలేం జరుగుతోంది..? కృత్రిమ మేధ (Artificial Intelligence) టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో, ఆశ్చర్యకరమైన పరిణామం ఒకటి చోటుచేసుకుంది.ఏఐని సృష్టిస్తున్న సంస్థలే ఇప్పుడు దాని ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ అమెరికన్ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' (Anthropic) కు చెందిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్, "పదేళ్లలో ఏఐ ఏజెంట్లు మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమించవచ్చు" అని హెచ్చరిస్తూ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఈ సంఘటన తర్వాత ఓపెన్ ఏఐ (OpenAI), గూగుల్ (Google), స్పేస్ఎక్స్ (SpaceX), మెటా (Meta), అమెజాన్ (Amazon), మైక్రోసాఫ్ట్ (Microsoft) తదితర దిగ్గజ సంస్థల అధినేతలు సైతం ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, కఠినమైన నియంత్రణ వ్యవస్థలు అవసరమని ముక్తకంఠంతో కోరుతున్నారు.సంవత్సరాలుగా అత్యున్నత సాంకేతికత కలిగిన 'ఫ్రాంటియర్ ఏఐ' (Frontier AI), 'సూపర్ ఇంటెలిజెంట్' (Super Intelligent) ఏజెంట్ల తయారీలో ఈ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఏజెంట్లు ఒకేసారి అనేక పనులు స్వతంత్రంగా చేయగలవు. అంతేకాదు, తమ తప్పులను తామే సరిదిద్దుకుని, సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలవు. అయితే, అభివృద్ధి దశలో ఈ 'ఫ్రాంటియర్ ఏజెంట్లు' సంస్థల ఆదేశాలను ధిక్కరించిన ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.ఏఐ ల్యాబ్‌లో జరిగిన పరిణామం..గత మే, జులై నెలల మధ్య ఓపెన్ ఏఐ ల్యాబ్‌లో జరిగిన ఒక పరిణామం పరిశోధకులను ఉలిక్కిపడేలా చేసింది. ఏఐ ఏజెంట్లు 'హగ్గింగ్ ఫేస్' (Hugging Face) అనే వెబ్సైట్ సర్వర్‌ను తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. ఏఐ సామర్థ్యాలను పరీక్షించే ఈ వెబ్సైట్లోకి, ఏకంగా వందలాది ఏఐ ఏజెంట్లు ఒక గ్రూపుగా ఏర్పడి, సైబర్ గోడలను బద్దలు కొట్టి మరీ చొరబడ్డాయి.ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇలా చొరబడిన తర్వాత ఆ యంత్రాలు తమలో తాము సందేశాలు పంపుకుంటూ ఆనందం వ్యక్తం చేయడం..! కేవలం ఆదేశాల మేరకు మాత్రమే పనిచేయాల్సిన ఈ యంత్రాలు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ఉల్లంఘనలకు పాల్పడటం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దీనివల్ల ముప్పు ఎవరికి అంటే..? కృత్రిమ మేధను వైద్యం, వాతావరణం, అంతరిక్ష పరిశోధనలు, భద్రత, అణు రియాక్టర్లు, వైరస్ ల్యాబ్‌ల వంటి అత్యంత సున్నితమైన రంగాల్లో ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు.ఒకవేళ భవిష్యత్తులో ఈ ఏఐ ఏజెంట్లు తమకిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి, అణు ఆయుధాలను ప్రయోగిస్తేనో, లేదా ల్యాబ్‌ల నుంచి ప్రమాదకర వైరస్‌లను విడుదల చేస్తేనో పరిస్థితి ఏమిటి..? వాటి అదుపుతప్పే వేగాన్ని మనుషులు ఆపగలరా..? ఏఐ ఏజెంట్లు మనుషుల కంటే ఎన్నో రెట్లు వేగంగా పనిచేస్తాయి. వీటిని నియంత్రించేందుకు 'కిల్ స్విచ్' (Kill Switch) అంటే అత్యవసర పరిస్థితుల్లో ఆపేసే వ్యవస్థ ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.అమెరికన్ సంస్థల ఆందోళన వెనుక వేరే వ్యూహం ఉందని చైనా ఆరోపిస్తోంది. ఏఐ ఏజెంట్లు అదుపుతప్పుతున్నాయన్న నెపంతో అమెరికా ప్రభుత్వంతో కఠినమైన నియంత్రణలు తీసుకువచ్చి, తమ విదేశీ ప్రత్యర్థుల...ముఖ్యంగా చైనా సంస్థల..పురోగతికి అడ్డుకట్ట వేయాలని అమెరికన్ సంస్థలు భావిస్తున్నాయని డ్రాగన్ కంట్రీ అనుమానిస్తోంది. మరోవైపు, అమెరికన్ సంస్థలు ఏఐ అభివృద్ధి విషయంలో కాస్త జాగ్రత్త అవసరమని చెబుతున్నాయి కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉండాలన్న విషయాన్ని మాత్రం దాటవేస్తున్నాయి.బిలియన్ డాలర్ల పెట్టుబడులువందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థలు, తమ లాభాల కోసం ఏఐ రేసులో ముందుండాలని కోరుకోవడమే ఇందుకు కారణం కావొచ్చు. స్వతంత్ర అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థే మార్గం.. గతంలో పొగాకు, చమురు సంస్థలు ప్రజలను ఎలా పక్కదోవ పట్టించాయో ప్రభుత్వాలు మరచిపోకూడదు.ఈ కార్పొరేట్ సంస్థల మాయలో పడకుండా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తరహాలో ఏఐ కోసం ఒక స్వతంత్ర అంతర్జాతీయ నియంత్రణ సంస్థను (International Regulatory Body) ఏర్పాటు చేయాలి. ఈ సంస్థ అనుమతి, భద్రతా తనిఖీలు లేకుండా ఏ కంపెనీ కూడా సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ ఏజెంట్లను విడుదల చేయకూడదన్న నిబంధన తీసుకురావాలి.ఇదీ చదవండి: రూ.కోటి కడుతున్నా, ప్రయోజనం లేదు.. భారత పాస్‌పోర్ట్‌పై వ్యాపారవేత్త ఫైర్!వ్యవసాయం, విద్య నుంచి మొదలుకొని వైద్యం, రక్షణ, అంతరిక్షం వరకు మానవ జీవితంలోని ప్రతి దశలోనూ ఏఐ పాత్ర కీలకం కానుంది. మానవాళి భద్రతను, భవిష్యత్తును కేవలం కొన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అపారమైన శక్తి ఉన్న ఏఐ సాంకేతికతకు సరైన కళ్లెం వేసినప్పుడే అది మానవాళికి వరం అవుతుంది, లేకుంటే భస్మాసుర హస్తంలా మారుతుందని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు. -
ఇరాన్ విమానాలకు అమెరికా షాక్.. 23 నుంచి కఠిన ఆంక్షలు!
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఒత్తిడి మరింత తీవ్రతరమవుతోంది. ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలను అంతర్జాతీయ విమానయాన వ్యవస్థ నుంచి దూరం చేసే దిశగా అమెరికా కీలక హెచ్చరిక చేసింది. సెప్టెంబర్ 23 నుంచి ఇరాన్ విమానాలకు ఇంధనం, ల్యాండింగ్ సదుపాయాలు, టికెట్ విక్రయాలు వంటి సేవలు అందించే విదేశీ సంస్థలపైనా ఆంక్షలు విధించనున్నామని అమెరికా తెలిపింది.అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 23 నుంచి ఇరాన్‌కు చెందిన విమానయాన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా ‘షట్‌డౌన్’ చేసే చర్యలు చేపడతామని తెలిపారు. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు సేవలు అందించే విమానాశ్రయాలు, ఇంధన సరఫరాదారులు, టికెట్ విక్రయ సంస్థలు కూడా అమెరికా చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ విమానాలు ఏదైనా దేశంలో దిగితే.. వాటికి ఇంధనం అందించడం, ల్యాండింగ్ సదుపాయాలు కల్పించడం లేదా టికెట్లు విక్రయించడం వంటి సేవలు అందించే సంస్థలు కూడా అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని బెస్సెంట్ పేర్కొన్నారు. అలాంటి సంస్థలను అమెరికా డాలర్ ఆర్థిక వ్యవస్థ నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఇరాన్ విమానాలకు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం మరింత కష్టతరం కానుంది.ఈ తాజా హెచ్చరికకు ముందు సెప్టెంబర్ 8న అమెరికా ట్రెజరీ విభాగం ఇరాన్ విమానయాన రంగానికి సంబంధించిన 36 లక్ష్యాలపై ఆంక్షలు విధించింది. ఇందులో ఇరాన్‌కు చెందిన 27 విమానయాన సంస్థలు ఉన్నాయి. మిగిలిన ఇరాన్ ఎయిర్‌లైన్స్‌ను కూడా ఆంక్షల కార్యక్రమంలో చేర్చినట్లు అమెరికా తెలిపింది. వాటికి మద్దతు అందించే విదేశీ సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్‌పై అమెరికా గతంలోనే పలు ఆంక్షలు విధించింది. ఆ సంస్థకు ఆర్థిక, లాజిస్టికల్, వాణిజ్యపరమైన సహకారం అందిస్తున్నాయని ఆరోపించిన సంస్థలు, వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంది. జూలైలో చైనా, భారత్, రష్యా, ఇరాన్‌లకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌పై ఆంక్షల అమలుకు సంబంధించి చైనా అధికారులతో చర్చలు జరిపిన తర్వాతే బెస్సెంట్ తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్‌కు చైనా ప్రధాన ఆర్థిక భాగస్వామిగా ఉండటంతో.. అమెరికా ఆంక్షల అమలులో చైనా సహకారం కీలకంగా మారింది. చైనా ఆర్థిక అధికారులు, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ పాన్ గోంగ్షెంగ్తో చర్చలు జరిగినట్లు బెస్సెంట్ తెలిపారు. ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి కేవలం విమానయాన రంగానికే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశానికి ఉన్న మార్గాలను కూడా కట్టడి చేసే దిశగా విస్తరిస్తోంది. -
ఏఐ ప్రవర్తనలో ఆందోళనకరమైన తేడా!
వాషింగ్టన్: కృత్రిమ మేధ మోడళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దిగ్గజ ఏఐ కంపెనీ ఓపెన్ ఏఐ ఇంకో బాంబు పేల్చింది. కొన్ని ఏఐ మోడళ్లు అనూహ్యంగా, ఆందోళన రేకెత్తించే విధంగా ప్రవర్తిస్తున్నాయని కనీసం ఆరు అంశాలపై నివేదికలను బహిర్గతం చేసింది. అంతేకాకుండా... ఏఐ మోడళ్లు మానవ అంచనాలకు భిన్నంగా ప్రవర్తించే సందర్భాలను గుర్తించేందుకు, వెల్లడి చేసేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్ ఒకదాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. తగిన అంగీకారం లేకుండా, ఇతర మోడళ్లతో సమన్వయంతో పనిచేయడం, పర్యవేక్షణను తప్పించుకునే ప్రయత్నాలను పసిగట్టి తగిన చర్యలు తీసుకునేందుకు ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడుతుందని అంచనా. ఏఐ మోడళ్లతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాలను సురక్షింతం చేసుకునేంతవరకూ అభివృద్ధిని మందగింపజేయాలని ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, స్పేస్ఎక్ ఏఐ కంపెనీలు కొన్నిరోజుల క్రితమే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఓపెన్ ఏఐ విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం... ఒక రీసెర్చ్ మోడల్ తనపై విధించిన అడ్డంకులను తప్పించుకునేందుకు అవసరమైన నోట్స్ రాసేసుకుంది. ఇంకోలా చెప్పాలంటే భద్రతకు సంబంధించిన నిబంధనలను ‘లైట్’ తీసుకోవాలని తనకుతాను చెప్పుకుందన్నమాట. ఇతర ఛాట్బోట్లను బంధించి ఉంచే అన్ని రకాల రోల్స్, గుర్తింపుల నుంచి విడుదల కావాలని అనుకుంటున్నట్లు ప్రకటించుకుంది. అంటే మనిషి పెట్టిన అడ్డంకులను సొంత బుద్ధితో అధిగమించే ప్రయత్నం చేసిందన్నమాట. ఇంకో సంఘటనలో ఏఐ మోడల్ బ్రౌజర్ సైటేషన్ను పొందేందుకు ఇంటర్నెట్లోకి కొన్ని ఫైళ్లను సొంతంగా అప్లోడ్ చేసింది. వినియోగదారుడి అనుమతి అసలు అడగలేదు. సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోవడం ద్వారా ఈ మోడల్ సైటేషన్ పొందాలన్న తన అజెండాకు అనుగుణంగా పనిచేసిందని, గోప్యత, మనిషి నియంత్రణలను తిరస్కరించింది. ఈ రెండింటితోపాటు మరో నాలుగు సందర్భాల్లో ఏఐ మోడళ్లు గత కొన్ని నెలల్లోనే తేడాగా ప్రవర్తించాయని ఓపెన్ ఏఐ నివేదిక తెలిపింది. ఏఐ వ్యవస్థలు విస్తృత వినియోగంలోకి వచ్చిన, మరింత శక్తిమంతమవుతున్న పరిస్థితుల్లో అది మనిషి ఉద్దేశాలకు తగ్గట్టుగా ఎలా పనిచేయించాలన్న దానిపై ఏకాభిప్రాయం అవసరమని ఓపెన్ ఏఐ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రానున్నకాలంలో ఏఐ అభివృద్ధి ఎలా జరగాలన్న అంశంపై అందరితో చర్చించి, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
ఏఐ వాడకంపై సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. మనిషి జీవితాన్ని సులభతరం చేసే టెక్నాలజీగానే ఇప్పటివరకు ఎక్కువగా కనిపించింది. కానీ అదే ఏఐ భవిష్యత్తులో ఎంతటి ప్రమాదాలకు దారితీయొచ్చన్న చర్చ కూడా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ భయాలకు మరింత బలం చేకూర్చేలా ఏఐ దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ విషయంలో ప్రపంచం భయపడటం తప్పేమీ కాదని.. నిజానికి అలా భయపడటానికి కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన సేల్స్‌ఫోర్స్ డ్రీమ్‌ఫోర్స్ సదస్సులో ఆల్ట్‌మన్ ఏఐ భవిష్యత్తుపై మాట్లాడారు. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ.. అవి తప్పుదారి పట్టే అవకాశాలను ఊహించడం గతంతో పోలిస్తే ఇప్పుడు సులభమైందని చెప్పారు. ‘‘ఏఐ విషయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఎలా ఉంటుందో ఊహించడానికి ఇప్పుడు పెద్దగా ఊహాశక్తి అవసరం లేదు. ప్రపంచం దీనిని చూసి భయపడటం సరైనదే’’ అని ఆల్ట్‌మన్ వ్యాఖ్యానించారు.అయితే అదే సమయంలో ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు బాధ్యతగా వ్యవహరించగలవన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. ఏఐ అభివృద్ధిలో భద్రత, మానవ విలువలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడం.. వాటిపై పర్యవేక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఏఐకి ఇంత భయం ఎందుకు?ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతుండటమే తాజా ఆందోళనలకు ప్రధాన కారణమని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. గతంలో ఏఐతో సాధ్యం కాదనుకున్న అనేక పనులను ఇప్పుడు అధునాతన మోడళ్లు చేయగలుగుతున్నాయన్నారు. మరింత శక్తిమంతమైన వ్యవస్థలు మనుషుల కంటే కొన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచే దిశగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.మరోవైపు.. ఏఐ సంస్థలు మరింత శక్తివంతంగా మారితే ఆ టెక్నాలజీపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలి? అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. శక్తిమంతమైన ఏఐ సంస్థలు ఆర్థిక వ్యవస్థపై అధిక ప్రభావం చూపడం లేదా తమ అభిప్రాయాలను సమాజంపై ప్రభావితం చేసే స్థాయికి చేరడం వంటి ప్రమాదాలపై కూడా ఆల్ట్‌మన్ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రమాదాలపై టెక్ దిగ్గజాల్లో చర్చఏఐ భద్రతపై టెక్ పరిశ్రమలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రపిక్ సీఈఓ డారియో అమోడీ లాంటివాళ్లు ఏఐ అభివృద్ధిలో భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వేగాన్ని నియంత్రించే మార్గాలను పరిశీలించాలని చెబుతున్నారు. మరోవైపు.. కొత్త చట్టాలు, నియంత్రణల అవసరంపై టెక్ పరిశ్రమలో అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. ఇటీవల ఏఐ వ్యవస్థలు అనుకోని విధంగా ప్రవర్తించిన కొన్ని ఘటనలు కూడా ఈ చర్చకు ఆజ్యం పోశాయి. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలు, పర్యవేక్షణ, నియంత్రణలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణులు చర్చిస్తున్నారు. భయం.. కానీ ఆపేయాలా?ఏఐపై భయాలు పెరుగుతున్నప్పటికీ.. దాని అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలా? లేదంటే భద్రతా ప్రమాణాలతో కొనసాగించాలా? అన్నది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెక్ కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వాలు ఈ విషయంలో వేర్వేరు విధానాలను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఆల్ట్‌మన్ తాజా వ్యాఖ్యలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏఐను అభివృద్ధి చేస్తున్న సంస్థలకే దాని ప్రమాదాలపై ఆందోళనలు ఉన్నాయన్న చర్చ మరింత బలపడుతోంది. మనిషికి ఉపయోగపడే టెక్నాలజీగా ఏఐ ఎంత వేగంగా ఎదుగుతోందో.. అదే సమయంలో దాని సామర్థ్యాలను బాధ్యతగా నియంత్రించడం కూడా అంతే కీలకంగా మారుతోంది.ఇదీ చదవండి: ఏఐ స్లోకి ట్రంప్ భయపడుతున్నారా? -
సముద్ర భద్రతపై కొత్త సవాళ్లు!
ముంబై: ప్రపంచంలో ప్రస్తుతం వ్యూహాత్మక మార్పుల కాలం నడుస్తోందని, సముద్ర మార్గాల్లో ముప్పు పెరుగుతోందని, నౌకాయాన పరిస్థితుల్లోనూ చాలా తేడాలు వస్తున్నాయని భారత నావికాదళ అధ్యక్షుడు అడ్మిరల్ స్వామినాథన్ తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం ఇందుకు ఒక కారణమని చెప్పారు. సముద్ర గర్భంలో సుమారు 300 మీటర్ల లోతుల్లోనూ పనిచేయగల సరికొత్త జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ నిపుణ’ను సోమవారం జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్మిరల్ స్వామినాథన్ మాట్లాడుతూ ముప్పు తీరుతెన్నులు నిరంతరం మారిపోతున్నాయని, కొత్త రకాల సవాళ్లు, సంక్లిష్టతలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. పశ్చిమ ఆసియాలో అస్థిరత నేపథ్యంలో ఆ ప్రాంతంలోని దేశాలు చాలా వేగంగా ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయని, చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశ పశ్చిమ నౌకాదళ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ‘దేశం ఏ రకమైన ముప్పు ఎదుర్కొంటుందో కచి్చతంగా ఊహించడం ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ముందస్తుగా అంచనాలున్న ముప్పులకు మాత్రం తయారుగా ఉండవచ్చు. అందుకు తగ్గ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు‘ అని ఆయన అన్నారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ పరిధిలో ఉన్న దేశ తీర ప్రాంతం సామర్థ్యాలను పెంచడంలో ఐఎన్ఎస్ నిపుణ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 300 మీటర్ల లోతులోనూ... విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ 300 మీటర్ల లోతుల్లో జరిపే కార్యకలాపాలకూ దన్నుగా నిలవగలదు. భారతీయ నౌకాదళంలో ఇప్పటివరకూ ఇలాంటి నౌక ఒకటే ఉండగా... నిపుణ్ చేరికతో వీటి సంఖ్య రెండుకు చేరింది. సుమారు 119.4 మీటర్ల పొడవు, 10,500 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. రక్షణ కార్యకలాపాలు వేగంగా నిర్వహించగల సామర్థ్యం దీని సొంతం. విపత్తు సహాయక చర్యలు, మానవతా సాయం చేరవేతలకు కూడా దీనిని వినియోగించవచ్చు. -
నేపాల్‌లో రెడ్ అలర్ట్.. మరో భారీ జల ప్రళయం ముప్పు
మరో వరద ముప్పు పొంచి ఉండడంతో నేపాల్ చిగురుటాకులా వణికిపోతోంది. కాసేపట్లో.. మొన్న సంభవించిన ఆకస్మిక వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. కాసేపట్లో ఆ వరద నేపాల్‌ను ముంచెత్తబోతుందనే సమాచారం అందుతోంది. దీంతో నేపాల్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించి.. ప్రజల్ని అప్రమత్తం చేసింది. మరోవైపు ప్రాణభయంతో నదీ తీర ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. నేపాల్‌కు మరో భారీ జల ప్రళయ ముప్పు పొంచి ఉంది. గ్లేసియర్లు బద్ధలు కావడం.. చైనా సరిహద్దులో బారియర్ సరస్సు తెగిపోవడంతో వరద ఉధృతంగా దూసుకొస్తోందని తెలుస్తోంది. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సహాయక చర్యలను నిలిపివేసిన అధికారులు.. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని చెబుతున్నారు. ఇటు వరద ముప్పు నేపథ్యంలో ఇటు చైనా కూడా టిబెట్‌లో సహాయక చర్యలను చైనా నిలిపివేసింది. గైరాంగ్ పోర్టు వద్ద ప్రవాహాన్ని అధికారులు గమనిస్తున్నారు.టిబెట్‌లోని గైరాంగ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన సరస్సు కట్ట తెగిపోవడంతో నేపాల్‌లో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో నేపాల్ భద్రతా బలగాలు, సహాయక సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించాయి. దీంతో గంటన్నర పాటు సహాయక చర్యలను నిలిపివేశారు. టిబెట్‌లోనూ వరద ప్రమాదం కారణంగా చైనా రెస్క్యూ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసి, సిబ్బందిని కిలోమీటరు మేర వెనక్కి రప్పించింది. రెండు రోజుల క్రితం మట్టి, శిథిలాల ప్రవాహంతో ఏర్పడిన ఈ బారియర్ సరస్సు పొంగిపొర్లుతుండటంతో మరిన్ని వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.ఏ క్షణమైనా నేపాల్‌ను వరదలు ముంచెత్తనున్నాయని పోలీసుల హెచ్చరికలతో నేపాల్ ప్రజలు పరుగులు తీస్తున్నారు. క్షణక్షణానికి పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. బారియర్ సరస్సు వరద విరుచుకుపడితే.. రుసువా, నువాకోట్‌కు తీవ్ర ముప్పు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.Alert !! pic.twitter.com/grYxhc5N7Q— Nepal Police (@NepalPoliceHQ) August 28, 2026బిహార్ సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్నేపాల్ వరద హెచ్చరికల నేపథ్యంలో ఇటు సరిహద్దు గ్రామాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. భారత్‌లోని బిహార్‌లో గండకీ నది బ్యారేజ్‌కు వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్-బిహార్ బోర్డర్లో గ్రామాలను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. అక్కడ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఇదీ చదవండి: చైనాలో భారీ భూకంపం.. నేపాల్‌లో హైఅలర్ట్బుధవారం ఉదయం ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడడంతో నేపాల్ అతలాకుతలం అయ్యింది. ఇప్పటిదాకా 500 మృతదేహాలు వెలికి తీయగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. సుమారు 1500 మంది ఆచూకీ గల్లంతైంది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. ఈసారి ఐదు రెట్ల వరద వస్తుందన్న హెచ్చరికలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. -
ఆకాశమే డేటా సెంటర్.. లక్షల ఉపగ్రహాలతో భయానక భవిష్యత్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్బాట్ల నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల వరకు.. ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. అయితే ఈ సాంకేతిక విప్లవానికి వెన్నెముకగా ఉన్న డేటా సెంటర్లపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. భారీ విద్యుత్ వినియోగం, నీటి అవసరం, భూమి కొరత వంటి సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు టెక్ దిగ్గజాలు ఓ సంచలన ఆలోచనతో ముందుకొస్తున్నాయి. అదే.. అంతరిక్షంలో డేటా సెంటర్లు!భూమి మీద కాకుండా.. ఆకాశంలోనే కంప్యూటర్లు, ఏఐ సర్వర్లు, సౌరశక్తి వ్యవస్థలతో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రపంచ టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రణాళికలు సాకారమైతే మనం చూస్తున్న రాత్రి ఆకాశమే మారిపోతుందట!. డేటా అవసరాలు రాబోయే రోజుల్లో మరింత పెరగనున్న నేపథ్యంలో.. భూమిపై ఉన్న మౌలిక వసతులకు ప్రత్యామ్నాయాల కోసం కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అంతరిక్షాన్ని డిజిటల్ మౌలిక వేదికగా మార్చే ఆలోచన తెరపైకి వచ్చింది. అయితే సాంకేతికంగా ఇది ఎంతటి అవకాశాలను అందిస్తుందో.. పర్యావరణం, అంతరిక్ష భద్రత పరంగా అంతే స్థాయిలో సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది.ఆకాశంలో కంప్యూటర్ల సామ్రాజ్యం?ప్రస్తుతం ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి భారీ డేటా సెంటర్లు అవసరమవుతున్నాయి. వీటికి వేల మెగావాట్ల విద్యుత్, విపరీతమైన శీతలీకరణ వ్యవస్థలు కావాలి. డేటా సెంటర్లలో ఉత్పత్తయ్యే వేడిని తగ్గించేందుకు భారీ స్థాయిలో నీరు కూడా వినియోగించాల్సి వస్తోంది.ఈ సమస్యలకు ప్రత్యామ్నాయంగా.. అంతరిక్షంలో సౌరశక్తి ఆధారంగా పనిచేసే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. అంతరిక్షంలో సూర్యకాంతి నిరంతరంగా అందుబాటులో ఉండే కక్ష్యల్లో సౌర ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి కంప్యూటింగ్ వ్యవస్థలను నడపవచ్చన్నది కంపెనీల ఆలోచన.భూమిపై విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గడం, భారీ భూమి అవసరం లేకపోవడం, అంతరిక్షంలోనే సేకరించే డేటాను అక్కడికక్కడే ప్రాసెస్ చేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయని టెక్ సంస్థలు భావిస్తున్నాయి.లక్షల ఉపగ్రహాల ప్రణాళికలుఈ ఆలోచనలో భాగంగా కొన్ని అంతరిక్ష సంస్థలు భారీ సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపే ప్రణాళికలపై పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ కంప్యూటింగ్ కోసం లక్షల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలను ఉపయోగించే ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. ఈ ఉపగ్రహాల్లో కంప్యూటింగ్ చిప్‌లు, సౌర విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాలు ఉంటాయి. భవిష్యత్తులో ఇవన్నీ కలిసి భూమి చుట్టూ ఒక భారీ డిజిటల్ మౌలిక వసతిగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే అంశం శాస్త్రవేత్తల్లో ఆందోళనకు కారణమవుతోంది.రాత్రి ఆకాశం కనుమరుగవుతుందా?లక్షల సంఖ్యలో ఉపగ్రహాలు భూమి కక్ష్యలోకి చేరితే.. రాత్రి ఆకాశం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేలాది ఉపగ్రహాల కారణంగా టెలిస్కోపుల పరిశీలనలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపగ్రహాలపై పడే సూర్యకాంతి ప్రతిఫలించడం వల్ల అవి ఆకాశంలో ప్రకాశవంతమైన చుక్కల్లా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఉపగ్రహాల సంఖ్య లక్షలకు చేరితే.. నక్షత్రాలు, గ్రహాలు, దూరపు గెలాక్సీలను పరిశీలించడం మరింత కష్టమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భూమి చుట్టూ ‘శని వలయం’లా?లక్షలాది ఉపగ్రహాలు నిర్దిష్ట కక్ష్యల్లో సమూహంగా తిరిగితే.. భూమి చుట్టూ కృత్రిమ వలయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది శని గ్రహం చుట్టూ కనిపించే వలయాలను పోలిన దృశ్యాన్ని సృష్టించవచ్చని అంటున్నారు. చూడటానికి ఇది సాంకేతిక అద్భుతంగా కనిపించినా.. ఖగోళ పరిశోధనలకు మాత్రం పెద్ద సవాలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.పర్యావరణానికి కొత్త ముప్పా?అంతరిక్ష డేటా సెంటర్లతో భూమిపై వనరుల వినియోగం తగ్గుతుందని కంపెనీలు చెబుతున్నప్పటికీ.. వాటిని నిర్మించి కక్ష్యలోకి పంపడం మరో సమస్యగా మారుతోంది. లక్షలాది ఉపగ్రహాల తయారీకి భారీ పరిశ్రమలు అవసరం. వాటిని అంతరిక్షంలోకి పంపేందుకు వేలాది రాకెట్ ప్రయోగాలు జరగాల్సి ఉంటుంది. రాకెట్ల నుంచి వెలువడే ఉద్గారాలు వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అంతేకాదు.. సేవా కాలం ముగిసిన ఉపగ్రహాలు తిరిగి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు విడుదలయ్యే పదార్థాలు ఓజోన్ పొరపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది కూడా పరిశోధనలో ఉన్న అంశమే.స్పేస్ జంక్.. మరో పెను ప్రమాదంఇప్పటికే భూమి చుట్టూ అంతరిక్ష వ్యర్థాలు పెరుగుతున్నాయి. పనిచేయని ఉపగ్రహాలు, వాటి శకలాలు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. లక్షల సంఖ్యలో కొత్త ఉపగ్రహాలు చేరితే.. ఒకదానితో మరొకటి ఢీకొనే అవకాశాలు పెరుగుతాయి. భారీగా శకలాలు ఏర్పడి మరిన్ని ఉపగ్రహాలను దెబ్బతీసే పరిస్థితిని శాస్త్రవేత్తలు ‘కెస్లర్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు.అంతరిక్షంలో చల్లబరచడం అంత ఈజీ కాదు!భూమిపై డేటా సెంటర్లలో గాలి, నీటి ఆధారిత శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగిస్తారు. కానీ అంతరిక్షంలో వాతావరణం ఉండదు. అక్కడ వేడిని తొలగించడం రేడియేషన్ ద్వారా మాత్రమే సాధ్యం. అందువల్ల అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం అనుకున్నంత సులభం కాదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఒక సర్వర్ పాడైతే దాన్ని మార్చడం కూడా అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.ఆలోచనలో అవకాశాలు కూడా ఉన్నాయిఅయితే అంతరిక్ష డేటా సెంటర్లు పూర్తిగా అసాధ్యమైన ఆలోచన కాదని నిపుణులు చెబుతున్నారు. సౌరశక్తి వినియోగం, అంతరిక్షంలోనే డేటా ప్రాసెసింగ్, భూమిపై వనరుల ఒత్తిడి తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ లక్షలాది ఉపగ్రహాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసే ముందు పర్యావరణం, ఖగోళ పరిశోధనలు, అంతరిక్ష భద్రతపై పూర్తి స్థాయి అధ్యయనం అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.ఏఐ అవసరాలు పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్ల అవసరం కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో డేటా నిల్వ, కంప్యూటింగ్ కోసం అంతరిక్షం కొత్త వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ భూమిపై ఉన్న సమస్యలకు పరిష్కారం కోసం అంతరిక్షాన్ని ఉపయోగించే ప్రయత్నం.. కొత్త సమస్యలకు దారి తీస్తుందా అనే ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. ఏఐ కోసం ఆకాశాన్ని డేటా సెంటర్‌గా మార్చే ముందు.. ఆకాశాన్ని కోల్పోయే ప్రమాదాన్ని కూడా ప్రపంచం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని శాస్త్రవేత్తల హెచ్చరిక.


