బంగారం కల్తీ.. ఆఫర్ల మాయలో పడొద్దు | Gold Adulteration Alert GJC Reports Rhenium Iridium Mixing BIS | Sakshi
Sakshi News home page

బంగారం కల్తీ.. ఆఫర్ల మాయలో పడొద్దు

Nov 27 2026 11:24 AM | Updated on Nov 27 2026 11:38 AM

Gold Adulteration Alert GJC Reports Rhenium Iridium Mixing BIS

పసిడి బరువును పెంచేందుకు రీనియం, ఇరీడియం ఆధారిత లోహాలను కలపడం ద్వారా కల్తీ చేస్తున్న ఉదంతాలను భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌) దృష్టికి తీసుకెళ్లినట్లు దేశీయ అఖిల భారత రత్నాభరణాల మండలి (జీజేసీ) తెలిపింది. ఈ విషయంలో పరిశ్రమ, వినియోగదారులు ఆందోళన చెందనక్కర్లేదని, బీఐఎస్‌ తగు చర్యలు తీసుకుంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది.

ఒకవేళ ఎక్కడైనా కల్తీ, అవకతవకలపై సందేహం కలిగితే తమతో పాటు బీఐఎస్‌కి కూడా సత్వరం ఫిర్యాదు చేయాలని జ్యుయలర్లు, వినియోగదారులను కోరింది. తయారీదారులు, హోల్‌సేలర్లు, సరఫరాదారుల నుంచి వచ్చే బంగారం నాణ్యతను సమగ్రంగా పరీక్షించాలని ఆభరణాల విక్రేతలకు సూచించింది. అలాగే కొనుగోలుదారులూ తక్కువ మేకింగ్‌ చార్జీల ఆఫర్ల మాయలో పడొద్దని, విశ్వసనీయమైన రిటైలర్ల నుంచే బంగారం కొనుగోలు చేయాలని పేర్కొంది.

పరీక్షించుకోవడం మంచిది

బంగారం స్వచ్ఛతను నిర్ధారించుకోవడంలో హాల్‌మార్కింగ్‌తో పాటు ఆధునిక పరీక్షా పద్ధతులకూ ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా రీనియం, ఇరీడియం వంటి అధిక సాంద్రత కలిగిన లోహాలను బంగారంలో కలిపితే సాధారణ ఎక్స్‌ఆర్‌ఎఫ్‌ (XRF) పరీక్షల్లో వాటిని గుర్తించడం కష్టమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో బీఐఎస్‌ హాల్‌మార్క్‌, ఆరు అంకెల హెచ్‌యూఐడీ (HUID) గుర్తింపు సంఖ్యను తప్పనిసరిగా పరిశీలించాలి. కొనుగోలు చేసిన ఆభరణాల స్వచ్ఛతపై అనుమానం ఉంటే బీఐఎస్‌ గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రాల్లో నాణ్యతను తనిఖీ చేయించుకోవడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement