కింది స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించడం, రూపాయి క్షీణించడంలాంటి అంశాల దన్నుతో బంగారం కాస్త పుంజుకుంది. గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రా. పసిడి రేటు రూ. 1,500 పెరిగి రూ. 1,27,500కి చేరింది.
అయితే.. వెండి ధర మాత్రం కేజీకి రూ. 1.50 లక్షలుగా ఏడాది కనిష్ట స్థాయిలోనే కొనసాగింది. అమెరికాలో ద్రవ్యోల్బణం డేటా ఊహించిన దానికన్నా అధికంగా ఉండటంతో ఫెడ్ రిజర్వ్ మరోసారి రేట్లను పెంచే అవకాశం ఉన్నందున ఆచితూచి కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అటు అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకి సుమారు 1% పెరిగి 3,567 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.


