అంతర్జాతీయంగా మెటల్ మార్కెట్లు బలహీనంగా ఉండటం, రూపాయి పుంజుకోవడం తదితర అంశాల కారణంగా బుధవారం దేశీయంగా వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో కేజీ వెండి రేటు ఏకంగా రూ. 7,000 క్షీణించి ఏడాది కనిష్ట స్థాయి రూ. 1.5 లక్షలకు పతమైంది. చివరిసారిగా 2025 అక్టోబర్ 3న సిల్వర్ ఈ స్థాయిలో ట్రేడయ్యింది.
మరోవైపు, పసిడి కూడా అదే బాటలో నడిచింది. 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 తగ్గి రూ. 1,26,000కి దిగి వచ్చింది. అమెరికా ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తున్న నేపథ్యంలో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నట్లు బ్రోకరేజ్ సంస్థ లెమన్‌లో రీసెర్చ్ హెడ్ గౌరవ్ గర్గ్ తెలిపారు.
అంతర్జాతీయంగానూ డౌన్..
అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 3 శాతం తగ్గి 3,452 డాలర్ల వద్ద, వెండి 6 శాతం తగ్గి 37.98 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. వెండి రేటు చివరి సారిగా 2025 సెప్టెంబర్‌లో ఈ స్థాయిలో ట్రేడయ్యింది.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయం.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు!


