ఫోన్‌పే మళ్లీ ఐపీవో బాట  | PhonePe is reportedly preparing to raise an initial public offering | Sakshi
Sakshi News home page

ఫోన్‌పే మళ్లీ ఐపీవో బాట 

Nov 26 2026 4:28 AM | Updated on Nov 26 2026 4:28 AM

PhonePe is reportedly preparing to raise an initial public offering

ఫిబ్రవరి–మార్చిలోగా లిస్టింగ్‌

న్యూఢిల్లీ: డిజిటల్‌ పేమెంట్స్‌ దిగ్గజం ఫోన్‌పే మరోసారి పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. 2027 ఫిబ్రవరి–మార్చిలోగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు వీలుగా సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్‌ చేయడంద్వారా రూ. 12,000–14,000 కోట్లు సమీకరించవచ్చని అంచనా. 

కంపెనీ విలువ 12–15 బిలియన్‌ డాలర్లు(రూ. 1.2–1.5 లక్షల కోట్లు)గా నమోదుకావచ్చని మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. కంపెనీ ఇంతక్రితం రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు, బలహీన ఆర్థిక పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్లలో భారీ ఆటుపోట్లు కారణంగా ఐపీవో ప్రణాళికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల  మార్కెట్లు జోరందుకోవడంతో తిగిరి ఐపీవో సన్నాహాలకు తెరతీస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement