6 యూరియా ప్రాజెక్టుల విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌  | Govt approved six new urea plants in brownfield category under the investment Policy | Sakshi
Sakshi News home page

6 యూరియా ప్రాజెక్టుల విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ 

Nov 26 2026 4:24 AM | Updated on Nov 26 2026 4:24 AM

Govt approved six new urea plants in brownfield category under the investment Policy

ఎరువులు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, స్వయం సమృద్ధి సాధించుకునే లక్ష్యాల్లో భాగంగా కేంద్రం 6 గ్యాస్‌ ఆధారిత యూరియా ప్రాజెక్టుల విస్తరణ, అప్‌ గ్రేడియేషన్‌కి  ఓకే చెప్పింది.   నూతన జాతీయ పెట్టుబడుల విధానం (ఎన్‌ఐపీయూ) కింద గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఈ ప్రాజెక్టుల విలువ రూ. 54,000 కోట్లు ఉంటుందని కేంద్రం తెలిపింది. చెన్నైలో ఎంఎఫ్‌ఎల్‌–మద్రాస్, పంజాబ్‌లో ఎన్‌ఎఫ్‌ఎల్‌ నాంగల్, ఉత్తర్‌ ప్రదేశ్‌లో కేఎఫ్‌ఎల్‌–షాజహాన్‌పూర్, పశి్చమ బెంగాల్‌లో మాటిక్స్‌–పనాగఢ్, రాజస్థాన్‌ కోటాలో సీఎఫ్‌సీఎల్‌ గడేపన్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐఐపీఎల్‌–జగదీశ్‌పూర్‌ ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement