కళాభిమానంతో వేదికపై నీతా అంబానీ అదిరిపోయే ప్రదర్శన | Nita Ambani Dazzles at Great Indian Musical Season 3 | Sakshi
Sakshi News home page

కళాభిమానంతో వేదికపై నీతా అంబానీ అదిరిపోయే ప్రదర్శన

Nov 26 2026 8:19 PM | Updated on Nov 26 2026 8:26 PM

Nita Ambani Dazzles at Great Indian Musical Season 3

భారతీయ కళా వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్న నీతా అంబానీ మరోసారి తనలోని కళాకారిణిని ఆవిష్కరించారు. ముంబైలోని నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఏసీసీ) వేదికగా ప్రతిష్ఠాత్మక ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’ మూడో సీజన్ ప్రారంభ వేడుక అట్టహాసంగా జరిగింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 13, 2026 వరకు ఎన్‌ఎంఏసీసీ గ్రాండ్ థియేటర్‌లో కొనసాగనున్న ఈ ప్రదర్శన ఆరంభోత్సవంలో నీతా అంబానీ స్వయంగా వేదికపైకి వచ్చి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయమైన భరతనాట్యం స్ఫూర్తితో సాగిన ఈ ప్రదర్శనలో ఆమె ధరించిన వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మణీష్ మల్హోత్రా రూపొందించిన ఈ దుస్తుల్లో దేశీయ చేనేత వైభవం ఉట్టిపడింది. చేతితో నేసిన బనారసీ బ్రోకేడ్, ఫ్యూషియా పింక్ టాంచోయ్ వస్త్రంపై సున్నితమైన ఆరి, జర్దోజీ ఎంబ్రాయిడరీ భారతీయ హస్తకళల ఔన్నత్యాన్ని చాటుతుంది.

భారతదేశ నాగరికతా ప్రయాణాన్ని సంగీత, నృత్య, నాటక రూపంలో ఆవిష్కరించే ఈ రంగస్థల ప్రదర్శనకు ఫెరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వం వహించగా అజయ్-అతుల్ సంగీతాన్ని సమకూర్చారు. మయూరి ఉపాధ్యాయ ప్రధాన నృత్య దర్శకత్వం వహించారు. కళ కేవలం వినోదం మాత్రమే కాదని దేశ చరిత్రను, సాంస్కృతిక కళను తరతరాలకు అందించే శక్తివంతమైన మాధ్యమమని నీతా అంబానీ ప్రదర్శన మరోసారి నిరూపించింది.

ఇదీ చదవండి: మాటలతో తేలేలాలేదు.. టీవీఎస్‌ ఆస్తులపై హైకోర్టులో దావా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement