హైదరాబాద్‌లో యాపిల్‌ స్టోర్‌ రెడీ.. ఇక ఓపెనింగే! | Hyderabad Is Getting Its First Apple Store Check Opening date Location | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో యాపిల్‌ స్టోర్‌ రెడీ.. ఇక ఓపెనింగే!

Nov 26 2026 6:05 PM | Updated on Nov 26 2026 6:22 PM

Hyderabad Is Getting Its First Apple Store Check Opening date Location

Hyderabad Apple Store: టెక్‌ దిగ్గజం యాపిల్‌ తెలంగాణలో తన తొలి సొంత రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌ 10న గురువారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని లేక్‌షోర్‌ షాపింగ్‌ మాల్‌లో ఈ స్టోర్‌ ప్రారంభం కానుంది. దేశంలో యాపిల్‌కు ఇది ఏడో రిటైల్‌ స్టోర్‌ కావడం విశేషం.

ఈ స్టోర్‌లో ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌ సహా యాపిల్‌ ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులకు సాంకేతిక సహాయం, అమ్మకాల అనంతర సేవలతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ సంస్కృతి, ప్రత్యేకతలను ప్రతిబింబించే వాల్‌పేపర్లు, స్టిక్కర్లు, సంగీత ప్లేలిస్ట్‌ను యాపిల్‌ విడుదల చేసింది.

భారత్‌లో తన రిటైల్‌ వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 2023లో ముంబై, ఢిల్లీలో తొలి రెండు సొంత స్టోర్లను ప్రారంభించిన సంస్థ.. ఆ తర్వాత బెంగళూరు, పుణె, నోయిడా నగరాల్లోనూ విస్తరించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే యాపిల్‌ ప్రీమియం రీసెల్లర్ల ద్వారా ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నప్పటికీ.. కూకట్‌పల్లిలో ప్రారంభం కానున్న స్టోర్‌ మాత్రం యాపిల్‌ నేరుగా నిర్వహించేది కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement