breaking news
Apple Retail Store
-
యాపిల్ మూడో స్టోర్ బెంగళూరులో.. రెంట్ ఎంతో తెలుసా?
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన రిటైల్ ఉనికిని విస్తరించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని ముంబై, ఢిల్లీలలో తమ రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్.. మూడో స్టోర్‌ను బెంగళూరులో తెరుస్తోంది. ఉత్తర బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో యాపిల్ కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి.ఢిల్లీ స్టోర్‌తో ఉత్తర భారతదేశంలో.. ముంబై స్టోర్‌తో పశ్చిమ భారత్‌లో ఆదరణను పెంచుకున్న యాపిల్.. ఇప్పుడు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న స్టోర్‌తో దక్షిణ భారత్‌లోనూ తమ ఉనికి విస్తరిస్తుందని భావిస్తోంది. తమ తయారీ భాగస్వామి ఫాక్స్‌కాన్ కూడా ఇక్కడ కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.బెంగళూరు స్టోర్ రెంట్ ఎంతంటే..యాపిల్ బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న స్టోర్‌కు నెలకు రూ.16 లక్షలకు పైగానే అద్దె చెల్లించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ బెంగళూరులోని తన స్టోర్ కోసం రూ .2.09 కోట్ల వార్షిక అద్దెతో 7,997.8 చదరపు అడుగుల స్థలాన్ని 10 సంవత్సరాల లీజుకు తీసుకుందని రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ ద్వారా పొందిన లీజు ఒప్పందాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. 2024 నవంబర్ 8న లీజు అధికారికంగా ప్రారంభం కాగా, 2025 ఆగస్టు 8 నుంచి అద్దె చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాపర్టీ స్పార్కిల్ వన్ మాల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినది. -
అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి!
ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో టెక్ దిగ్గజం యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ‘యాపిల్ బీకేసీ’ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ స్టోర్‌ను (ఏప్రిల్ 18న) యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రారంభించారు. రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానున్నడంతో స్టోర్‌ను వీక్షించేందుకు, అందులోని ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసేందుకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన యాపిల్ అభిమానులు యాపిల్ బీకేసీ స్టోర్ ఎదుట బారులు తీరారు. చాలా మంది సందర్శకులు స్టీవ్ జాబ్స్ ఇష్టపడేలా టీ-షర్టులను ధరించారు. వారి జుట్టును యాపిల్ లోగో ఆకారంలో కత్తిరించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఓ అభిమాని 1984లో ప్రారంభించిన మొదటి యాపిల్ కంప్యూటర్ వెర్షన్ (మాకింతోష్ కంప్యూటర్)ను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాపిల్ ఉత్పత్తులతో తమకున్న అనుబంధాల్ని, స్మృతులను నెమరేసుకున్నారు. అయితే రిటైల్ స్టోర్ ప్రారంభం అనంతరం అభిమానులతో కరచాలనం చేసిన టిమ్‌కుక్ సదరు ఫ్యాన్ తెచ్చిన కంప్యూటర్ను చూసి ‘వావ్’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ‘నేను తొలిసారి 1984 యాపిల్ కంప్యూటర్ను కొనుగోలు చేశా. నాటి నుంచి యాపిల్ ఉత్పత్తులనే వినియోగిస్తున్నా. తన చేతిలో ఉన్న కంప్యూటర్ను చూపిస్తూ ఇదిగో దీని డిస్కోస్టోరేజ్ కెపాసిటీ 2 మెగాబైట్స్. బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్స్‌లో ఉంది. ఇప్పుడు ఇదే కంప్యూటర్ను యాపిల్ 4కే, 8కే రెసెల్యూషన్ డిస్ప్లేలను తయారు చేస్తోంది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాపిల్ అభిమాని తన వెంట తీసుకొచ్చిన యాపిల్ కంప్యూటర్ను టిమ్ కుక్కు చూపించడం.. ఆ కంప్యూటర్ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, సినీ హీరో హీరోయిన్లకే కాదు ఎలక్ట్రానిక్స్ వస్తువులకు అభిమానులుంటారని యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి👉 ‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్ -
Apple Store In India: భారత్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్.. ప్రారంభించిన టిమ్‌కుక్!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాపిల్ స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టింది. యాపిల్ బీకేసీ (Apple BKC) పేరుతో ముంబైలో ఏర్పాటైన యాపిల్ రిటైల్ స్టోర్‌ను ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్ ప్రారంభించారు. దీంతో ముంబై బాంద్ర కుర్లా కాంప్లెక్స్‌లో అందుబాటులోకి వచ్చిన రిటైల్స్టోర్లో యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే సౌకర్యం కలిగినట్లైంది. ఏప్రిల్ 18న (ఈరోజు) వన్.. టూ..త్రీ అంటూ యాపిల్ ఉద్యోగుల కరతాళ ధ్వనుల మధ్య టిమ్‌కుక్ రిటైల్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. ముందుగా అనున్నకున్నట్లుగా మూహూర్తపు సమయానికి యాపిల్ బీకేసీ స్టోర్ డోర్లను ఓపెన్ చేశారు. అనంతరం స్టోర్ లోపలి నుంచి ఎంట్రన్స్ వద్దకు వచ్చిన టిమ్‌కుక్ భారతీయుల్ని మరింత ఉత్సాహ పరిచేలా చేతులు జోడించి నమస్కరించి ముందుకు సాగారు. ఇక బీకేసీ.. బీకేసీ.. బీకేసీ అంటూ ఉద్యోగులు, వినియోగదారులకు నినాదాల మధ్య ఆ ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. రిటైల్ స్టోర్‌లో అమ్మకాలు ప్రారంభం ఇప్పటివరకు, యాపిల్ సంస్థ యాపిల్ వాచ్,ఐఫోన్, ఐప్యాడ్(Pad),ఐపాడ్ (iPod),ఐమాక్ ఇలా ప్రొడక్ట్‌లను ఆన్లైన్లో లేదంటే థర్డ్ పార్టీ సంస్థల నుంచి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవి. లేదంటే ఫ్లిప్‌కార్ట్,అమెజాన్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం లభించేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన యాపిల్ బీకేసీ రిటైల్ స్టోర్‌లో యాపిల్ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయొచ్చు. రూ.738 కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి యాపిల్ సంస్థలో ఏప్రిల్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్యకాలంలో సుమారు 9 బిలియన్ (దాదాపు రూ. 738 కోట్లు) విలువైన ప్రొడక్ట్‌లను ఎగుమతి చేసింది. అందులో 50 శాతానికి పైగా ఐఫోన్లు ఉన్నాయని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ నివేదిక తెలిపింది.ఇక స్టోర్ల ప్రారంభంతో యాపిల్ బిజినెస్ మరింత వృద్ది సాధింస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #WATCH | Apple CEO Tim Cook opens the gates to India's first Apple store at Mumbai's Bandra Kurla Complex pic.twitter.com/MCMzspFrvp — ANI (@ANI) April 18, 2023 తెల్లవారుజాము నుంచే పడిగాపులు మరోవైపు రిటైల్ స్టోర్‌ను యాపిల్ ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు స్టోర్ వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. స్టోర్ ప్రారంభించేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మంగళవారం తెల్లవారు జాము నుంచి దీని ముందు పడిగాపులు కాశారు.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.