Apple CEO Tim Cook Launches The Company First Retail Store In India Called Apple BMK - Sakshi
Sakshi News home page

Apple BKC Store In Mumbai: భారత్‌లో తొలి యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌.. ప్రారంభించిన టిమ్‌కుక్‌!

Apr 18 2023 11:09 AM | Updated on Apr 18 2023 12:00 PM

Apple Ceo Tim Cook Launches The Company First Retail Store In India - Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాపిల్‌ స్మార్ట్‌ఫోన్‌ దేశీయ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. యాపిల్‌ బీకేసీ (Apple BKC) పేరుతో ముంబైలో ఏర్పాటైన యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌ ప్రారంభించారు. దీంతో ముంబై బాంద్ర కుర్లా కాంప్లెక్స్‌లో అందుబాటులోకి వచ్చిన రిటైల్‌స్టోర్‌లో యాపిల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసే సౌకర్యం కలిగినట్లైంది. 

ఏప్రిల్‌ 18న (ఈరోజు) వన్‌.. టూ..త్రీ అంటూ యాపిల్‌ ఉద్యోగుల కరతాళ ధ్వనుల మధ్య టిమ్‌కుక్‌ రిటైల్‌ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. ముందుగా అనున్నకున్నట్లుగా మూహూర్తపు సమయానికి యాపిల్‌ బీకేసీ స్టోర్‌ డోర్లను ఓపెన్‌ చేశారు. అనంతరం స్టోర్‌ లోపలి నుంచి ఎంట్రన్స్‌ వద‍్దకు వచ్చిన టిమ్‌కుక్‌ భారతీయుల్ని మరింత ఉత్సాహ పరిచేలా చేతులు జోడించి నమస్కరించి ముందుకు సాగారు. ఇక  బీకేసీ.. బీకేసీ.. బీకేసీ అంటూ ఉద్యోగులు, వినియోగదారులకు నినాదాల మధ్య ఆ ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. 


 
రిటైల్‌ స్టోర్‌లో అమ్మకాలు ప్రారంభం
ఇప్పటివరకు, యాపిల్ సంస్థ యాపిల్‌ వాచ్‌,ఐఫోన్‌, ఐప్యాడ్‌(Pad),ఐపాడ్‌ (iPod),ఐమాక్‌ ఇలా ప్రొడక్ట్‌లను ఆన్‌లైన్‌లో లేదంటే థర్డ్‌ పార్టీ సంస్థల నుంచి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవి. లేదంటే ఫ్లిప్‌కార్ట్‌,అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా యాపిల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం లభించేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన యాపిల్‌ బీకేసీ రిటైల్‌ స్టోర్‌లో యాపిల్‌ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయొచ్చు.  

రూ.738 కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి
యాపిల్‌ సంస్థలో ఏప్రిల్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్యకాలంలో సుమారు 9 బిలియన్ (దాదాపు రూ. 738 కోట్లు) విలువైన  ప్రొడక్ట్‌లను ఎగుమతి చేసింది. అందులో 50 శాతానికి పైగా ఐఫోన్‌లు ఉన్నాయని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ నివేదిక తెలిపింది.ఇక స్టోర్‌ల ప్రారంభంతో యాపిల్‌ బిజినెస్‌ మరింత వృద్ది సాధింస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


తెల్లవారుజాము నుంచే పడిగాపులు
మరోవైపు రిటైల్‌ స్టోర్‌ను యాపిల్‌ ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు స్టోర్‌ వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. స్టోర్‌ ప్రారంభించేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మంగళవారం తెల్లవారు జాము నుంచి దీని ముందు పడిగాపులు కాశారు.ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement