ముగ్గురు మహిళల ప్రయాణం | I hate marriage Movie Pre-release | Sakshi
Sakshi News home page

ముగ్గురు మహిళల ప్రయాణం

Nov 26 2026 6:26 AM | Updated on Nov 26 2026 6:27 AM

I hate marriage Movie Pre-release

సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘ఐ హేట్‌ మ్యారేజ్‌’. పరమేష్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో ఆర్య సినిమాపై మాదం దయానంద్, కార్తీక్‌ వెంపటి  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో పరమేష్‌ రేణికుంట్ల మాట్లాడుతూ–‘‘ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాన్నే ‘ఐ హేట్‌ మ్యారేజ్‌’లో చూపించాను. జెన్ జీకి నచ్చే కథ. ఇది బోల్డ్‌ సినిమా కాదు.. హార్ట్‌ టచ్చింగ్‌ లవ్‌స్టోరి ఇది’’ అని తెలిపారు. 

‘‘ఈ సినిమాలోని భావోద్వేగాలు ఆడియన్స్ను కట్టిపడేస్తాయి’’ అని మాదం దయానంద్‌ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా యువతరంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా నచ్చుతుంది’’ అన్నారు జుప్సీ భద్ర. ‘‘ముగ్గురు మహిళల ప్రయాణం, ఓ అబ్బాయి కథ ఇది’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ తెలిపారు. నటీమణులు హారిక, సాహితి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement