ప్రేక్షకుల నవ్వులే నాకు స్ఫూర్తి | Making Audiences Laugh Is a Serious Creative Exercise, Says Anil Ravipudi | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల నవ్వులే నాకు స్ఫూర్తి

Nov 26 2026 6:17 AM | Updated on Nov 26 2026 6:17 AM

Making Audiences Laugh Is a Serious Creative Exercise, Says Anil Ravipudi

– అనిల్‌ రావిపూడి

‘‘ప్రేక్షకులకు ఏ జోక్‌ ఏ స్థాయిలో నచ్చుతుందో ముందే అంచనా వేయడం కష్టం. అందుకే ఆడియన్స్‌ని నవ్వించడం చాలా కష్టమైన సృజనాత్మకతతో కూడిన ప్రక్రియగా భావిస్తాను. ప్రేక్షకుల నవ్వులే నాకు స్ఫూర్తి’’ అని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. గోవా వేదికగా 57వ ఇఫీ (ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించిన  ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం ఈ ఏడాది జనవరి 12న విడుదలైంది. 

‘ఇఫీ’లోని ఇండియన్  పనోరమా మెయిన్  స్ట్రీమ్‌ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. ఈ సందర్భంగా ‘ఇఫీ’ వేడుకల్లో అనిల్‌ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మితా కొణిదెల, నటి కేథరీన్  పాల్గొన్నారు. కాగా ఇఫీ వేడుకల్లోనే ‘లతా మంగేష్కర్‌ టాక్‌: ది వాయిస్‌ దట్‌ ఎకోస్‌ ఫరెవర్‌– ఇన్  ది మెమరీ ఆఫ్‌ ఆశా భోస్లే అండ్‌ ఎస్‌. జానకి’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సింగర్‌ కె.ఎస్‌. చిత్ర, నటి సుహాసిని మణిరత్నం పాల్గొన్నారు. ‘‘నేను అభిమానించే లతా మంగేష్కర్, పి.సుశీల, ఎస్‌. జానకిగార్ల గురించి మాట్లాడే అవకాశం ఈ వేదికగా లభించడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు కె.ఎస్‌. చిత్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement