‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రచారాన్ని ప్రారంభించిన సీజేపీ | CJP launches Kya Bolti Public campaign in Goa | Sakshi
Sakshi News home page

‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రచారాన్ని ప్రారంభించిన సీజేపీ

Nov 22 2026 7:35 PM | Updated on Nov 22 2026 7:42 PM

CJP launches Kya Bolti Public campaign in Goa

గోవా: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన ‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రచారాన్ని గోవాలో ప్రారంభించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గోవా ప్రజల నుంచి తమకు లభించిన మద్దతుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పనాజీలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రచార ప్రారంభ కార్యక్రమంలో దీప్కే మాట్లాడారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన నిరసనకు మద్దతుగా గోవాలోనూ ప్రజలు వీధుల్లోకి వచ్చారని, అయితే ఆ విషయం తమకు ముందుగా తెలియదని ఆయన తెలిపారు.

“జంతర్ మంతర్ వద్ద మేము నిరసన చేపట్టిన సమయంలో, మాకు సంఘీభావం తెలపడానికి గోవాలో కూడా ప్రజలు వీధుల్లోకి వచ్చారనే విషయం తెలియదు” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్, పార్టీ నాయకుడు ఆశుతోష్ రంకా తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జార్జ్ వాషింగ్టన్ వెంట్రుకల వేలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement