అర్ధరాత్రి ఆస్పత్రిలోకి చొరబడిన దుండగుడు | shocking incident In Karnataka Hospital | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఆస్పత్రిలోకి చొరబడిన దుండగుడు

Nov 22 2026 2:13 PM | Updated on Nov 22 2026 2:15 PM

shocking incident In Karnataka Hospital

కర్ణాటక: గుర్తు తెలియని వ్యక్తి ఆస్పత్రిలోకి చొరబడి హల్‌చల్‌ చేశాడు. మహిళా రోగులపట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. ఈ ఈఘటన  హావేరి జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. హావేరి జిల్లా ఆస్పత్రిలోని రూం నంబర్‌ 10లో ఉన్న మహిళా రోగుల వార్డులోకి నాలుగు రోజుల క్రితం రాత్రి 2 గంటల సమయంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు. 

నిద్రిస్తున్న రోగి బేడ్‌పై పడుకొని అసభ్యకరంగా తాకాడు. మేల్కొన్న బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. నిందితుడిని పట్టుకునేందుకు యత్నించగా ఉడాయించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. జిల్లా ఆస్పత్రిలో వారం రోజులుగా దొంగల బెడద కూడా అధికమైందని, సెల్‌పోన్లు చోరీకి గురైనట్లు రోగుల  బంధువులు ఆరోపిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement