‘మెట్రో పింక్‌ లైన్‌’ను ప్రారంభించిన ప్రధాని, కర్ణాటక సీఎంతో మెట్రో రైడ్‌ | PM inaugurates Bengaluru Metro Pink Line takes ride with DK Shivakumar | Sakshi
Sakshi News home page

‘మెట్రో పింక్‌ లైన్‌’ను ప్రారంభించిన ప్రధాని, కర్ణాటక సీఎంతో మెట్రో రైడ్‌

Nov 13 2026 1:52 PM | Updated on Nov 13 2026 1:55 PM

PM inaugurates Bengaluru Metro Pink Line takes ride with DK Shivakumar

సాక్షి, బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భాగంగా బెంగళూరులో మెట్రో 'పింక్ లైన్' (Pink Line) శుక్రవారం ప్రారంభించారు.  అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి  డీకే శివకుమార్, ఇతర ప్రముఖులతో కలిసి తవరేకెరె (Tavarekere) నుండి ఐఐఎం బెంగళూరు (IIM Bangalore) మెట్రో స్టేషన్ వరకు కొత్తగా ప్రారంభించిన 7.5 కిలోమీటర్ల మార్గంలో ఆయన ప్రయాణించారు.

రైలు ఎక్కే ముందు ప్రధాని మోదీ కౌంటర్ వద్ద యూపీఐ (UPI) ద్వారా మెట్రో టికెట్ కొనుగోలు చేశారు. ఈ ప్రయాణంలో ఆయన వెంట కర్ణాటక సీఎం శివకుమార్, గవర్నర్ సుధా యాదవ్, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, మంత్రి కె.బి. గౌడ తదితరులున్నారు. ఈ సందర్భంగా  ప్రధాని మోదీ  ప్రయాణీకులతో 

ముచ్చటించారు. కలేన అగ్రహార (Kalena Agrahara) నుండి తవరేకెరె వరకు అనుసంధానించే ఈ పింక్ లైన్‌ను సుమారు రూ. 3,470 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీని ప్రారంభం బెంగళూరు మెట్రో నెట్‌వర్క్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రూ. 15,600 కోట్లకు పైగా విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

 y"> వందే భారత్ ఎక్స్‌ప్రెస్: బెంగళూరు, తీరప్రాంత కర్ణాటక మరియు గోవా మధ్య వేగవంతమైన రైలు అనుసంధానాన్ని కల్పించే బెంగళూరు-మంగళూరు-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

అమృత్ భారత్ స్టేషన్లు: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన చామరాజనగర్, చిక్కమగళూరు, సకలేశ్‌పూర్ మరియు సుబ్రహ్మణ్య రోడ్ అనే నాలుగు రైల్వే స్టేషన్లను ఆయన ప్రారంభిస్తారు.

రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ: 284 కి.మీ. గదగ్-హోస్పేట్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగమైన 45 కి.మీ. బాగల్‌కోట్-వండాల్ రైల్వే లైన్ డబ్లింగ్ సెక్షన్‌ను, అలాగే 55 కి.మీ. సకలేశ్‌పూర్-సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ రైల్వే సెక్షన్ విద్యుదీకరణ పనులను ఆయన జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు  సుమారు రూ. 4,450 కోట్ల వ్యయంతో కొప్పళ-II మరియు గదగ్-II లలో నిర్మించిన పునరుత్పాదక ఇంధన మండలాల అనుసంధాన ట్రాన్స్‌మిషన్ పథకాన్ని (ఫేజ్-II), అలాగే సుమారు రూ. 1,370 కోట్ల పెట్టుబడితో బీదర్‌లోని సౌర ఇంధన మండలం కోసం నిర్మించిన ట్రాన్స్‌మిషన్ పథకాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement