శబరిమల: ఇక రోజుకు 85 వేల మందికి దర్శన భాగ్యం! | Sabarimala Now 85 thousand people will have the opportunity to have darshan every day | Sakshi
Sakshi News home page

శబరిమల: ఇక రోజుకు 85 వేల మందికి దర్శన భాగ్యం!

Nov 22 2026 10:33 AM | Updated on Nov 22 2026 10:33 AM

Sabarimala Now 85 thousand people will have the opportunity to have darshan every day

పతనంతిట్ట: అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తీపి కబురు అందించింది. మండల-మకరవిళక్కు ఉత్సవాల సందర్భంగా శబరిమలలో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 వరకు ప్రతిరోజూ అదనంగా 5 వేల వర్చువల్ క్యూ టికెట్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో రోజువారీ దర్శన సామర్థ్యం 85 వేలకు చేరనుంది.

రాత్రి 10 గంటలకు విడుదల
అదనపు టికెట్లను ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు sabarimalaonline.org అధికారిక పోర్టల్‌లో దశలవారీగా విడుదల చేస్తారు. ఒకేసారి కాకుండా విడతలవారీగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బల్క్ బుకింగులను అరికట్టాలని బోర్డు భావిస్తోంది. నవంబర్ 22కు తొలుత 4 వేల టికెట్లు విడుదల చేయగా, మిగిలిన వెయ్యి మరుసటి రోజు అందుబాటులోకి తెచ్చింది.

ఆధార్ ఓటీపీ తప్పనిసరి
టికెట్లను ఏజెంట్లు పెద్ద సంఖ్యలో బుక్ చేసి అధిక ధరలకు విక్రయించకుండా ఆధార్ ఆధారిత ఓటీపీ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. బుకింగ్ సమయంలో ఆధార్ నంబరు నమోదు చేసి, అనుసంధానిత మొబైల్‌కు వచ్చే ఓటీపీని ధ్రువీకరించాలి. బుక్ చేసుకున్న తేదీన దర్శనానికి రాకుండా, టికెట్ రద్దు చేసుకోని వారికి అదే యాత్రా సీజన్‌లో మరో స్లాట్ ఇవ్వకూడదని ప్రతిపాదిస్తున్నారు. అవసరమైతే టికెట్ రద్దు లేదా తేదీ మార్పునకు అవకాశం కల్పించనున్నారు.

రోజుకు 85 వేల మందికి దర్శనం
ప్రస్తుతం వర్చువల్ క్యూ ద్వారా 66 వేల మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 14 వేల మందికి అనుమతి ఉంది. తాజాగా పెంచిన 5 వేల టికెట్లతో రోజువారీ పరిమితి 85 వేలకు చేరుతుంది. నిర్ణీత సమయంలో అధికారిక పోర్టల్‌ను పరిశీలించాలని టీడీబీ ప్రజా సంబంధాల అధికారి జీఎస్ అరుణ్ భక్తులకు సూచించారు.

ఇదీ చదవండి: బహ్రెయిన్‌లో బాంబుల మోత.. తెలుగు ప్రవాసుల్లో టెన్షన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement