తమిళనాడులో ప్రేమోన్మాది కిరాతకం | Tamil Nadu: Minor Girl Incident | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ప్రేమోన్మాది కిరాతకం

Nov 22 2026 8:09 AM | Updated on Nov 22 2026 8:16 AM

Tamil Nadu: Minor Girl Incident

ఇతర అబ్బాయిలతో మాట్లాడొద్దంటూ ప్రియురాలిపై ఆంక్షలు విధించాడు.. తన మాట వినడం లేదన్న కోపంతో ఏకంగా హత్యకు తెగబడ్డాడు. 17 ఏళ్ల బాలికను గొంతు నులిమి, కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

తూత్తుకుడి జిల్లా ఐరాల్‌ సమీపంలోని సోలైపుత్తూరులోని సేపతయ్యపురం వేదమాణిక్కపురం ప్రాంతానికి చెందిన కాశీపాండియన్‌ కుమారుడు ముత్తురాజా (ముత్తురాజు) వెల్డింగ్‌ వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక సేపతయపురంలోని ముత్తుమలై అమ్మన్‌ పాఠశాలలో ప్లస్‌– 1 చదువుతోంది. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. 

ఈ విషయం ఇరు కుటుంబాలదృష్టికి వెళ్లగా, అమ్మాయి చదువు పూర్తయ్యాక వివాహం గురించి మాట్లాడుకోవాలని పెద్దలు నిర్ణయించినటు తెలిసింది. కాగా ఇటీవల విద్యార్థిని తన ఫోన్‌లో మరొకరితో మాట్లాడుతోందని, తనతో తరచుగా గొడవ పడుతోందని ముత్తురాజా అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని వద్దకు సాయంత్రం  ముత్తురాజా వెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో, ఆగ్రహంతో ఆమెపై కత్తితో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆ తర్వాత ముత్తురాజా శరీరంపై కూడా పదునైన ఆయుధంతో గాయాలై స్పహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు అతడిని రక్షించి తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మృతి చెందిన విద్యారి్థని మృతదేహాన్ని తొలుత సేపతయపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎంకే స్టాలిన్‌కు మరో పరీక్ష.. !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement