‘రామాయణం’ను నిషేధించాలి: వీహెచ్‌పీ | Vishva Hindu Parishad seeks ban on Ranbir Kapoor Ramayana Movie | Sakshi
Sakshi News home page

‘రామాయణం’ను నిషేధించాలి: వీహెచ్‌పీ

Nov 22 2026 6:17 AM | Updated on Nov 22 2026 6:17 AM

Vishva Hindu Parishad seeks ban on Ranbir Kapoor Ramayana Movie

న్యూఢిల్లీ: ఇటీవల విడుదలైన రామాయణం సినిమాపై విశ్వహిందూ పరిషత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రామాయణంలోని ఐతిహాసిక ఘటనలను వక్రీకరించారని, కృత్రిమ సంఘటనలను ముందుకు తీసుకువచ్చి హిందువుల విశ్వాసాలను దెబ్బతీశారని ఆరోపించింది. రాక్షస రాజు రావణుడిని అణగారిని వర్గాల వారికి రక్షకుడిలా ఆదర్శంగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఈ చిత్రంలో కేవలం నాటకీయ అంశాలను చొప్పించడం మాత్రమే కాదు, రామాయణానికి మూలమైన విలువలపై దాడికి సైతం ప్రయత్నం జరిగిందని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ ఆరోపించారు. మొత్తంగా ఈ సినిమాపై నిషేధం విధించాలని, దేశంలో ఎక్కడ ప్రదర్శించకుండా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు కూడా సినిమాలో వక్రీకరణకు గురైన ఘటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. సినిమాట్రోఫీ చట్టం కింద ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడంపై కోర్టుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement