తిరుచెందూర్‌లో ఒకే రోజు వంద పెళ్లిళ్లు | 100 weddings were solemnised in a single day at the Subramaniya Swamy Temple in Tiruchendur | Sakshi
Sakshi News home page

తిరుచెందూర్‌లో ఒకే రోజు వంద పెళ్లిళ్లు

Nov 22 2026 6:10 AM | Updated on Nov 22 2026 6:10 AM

100 weddings were solemnised in a single day at the Subramaniya Swamy Temple in Tiruchendur

ట్యుటికోరన్‌: తమిళనాడులోని తిరుచెందూర్‌లో ఉన్న సుబ్రమణ్య మురుగన్‌ ఆలయం శుక్రవారం నవ వధూవరులతో కళకళలాడింది. ఒకే రోజు ఆలయంలో 100కు పైగా జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. సాధారణంగానే ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పండుగలు, ఉత్సవాలు, సెలవు రోజుల్లో రద్దీ మరింతగా పెరిగిపోతుంది.

 శుక్రవారం మంచి రోజు కావడంతో భక్తులతోపాటు నూతన వధూవరులు, వారి తల్లిదండ్రులు, బంధువులు వేకువజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంతోపాటు షణ్ముఖ విలాస్‌ మండపం నిండిపోయాయని దేవాదాయ శాఖ తెలిపింది. సాధారణ ఉచిత దర్శనాలతోపాటు రూ.100 స్పెషల్‌ దర్శనం లైన్లలో జనం మూడు గంటలకుపైగా ఎదురు చూడాల్సి వచ్చిందని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement