సోనియాపై పుస్తకం రాస్తా | BJP MP Nishikant Dubey plans real book on Sonia Gandhi | Sakshi
Sakshi News home page

సోనియాపై పుస్తకం రాస్తా

Nov 22 2026 5:34 AM | Updated on Nov 22 2026 5:34 AM

BJP MP Nishikant Dubey plans real book on Sonia Gandhi

ఆమె గురించిన వాస్తవాలను వెల్లడిస్తా

బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే వెల్లడి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ గురించిన వాస్తవాలతో కూడిన వివరాలతో పుస్తకం రాయనున్నట్లు బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే ప్రకటించారు. విదేశీయురాలైన సోనియా గాంధీ కార్ల ఉత్పత్తి సంస్థ మారుతికి యజమానిగా ఎలా మారారు? నేషనల్‌ హెరాల్డ్‌ను ఎలా కొనుగోలు చేయగలిగారు? వంటి వివరాలు సైతం తాను రాసే పుస్తకంలో ఉంటాయని దుబే శనివారం ఎక్స్‌లో వెల్లడించారు. 

2004–14 సంవత్సరాల మధ్య కాలంలో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమె రాజ్యాంగేతర శక్తిగా ఎలా వ్యవహరించారు? సోనియా గాంధీకి, ఆమె తోడి కోడలు మేనకా గాంధీకి మధ్య విభేదాలకు వాస్తవ కారణాలేంటి? వంటి అంశాలను కూడా తాను వెల్లడిస్తానన్నారు. బోఫోర్స్‌ కుంభకోణం వెనుక జరిగిన వాస్తవ ఘటనల క్రమాన్ని కూడా తన పుస్తకంలో ఉంటాయని దుబే పేర్కొన్నారు. 

చైనాలో జరిగిన ఒలంపిక్‌ క్రీడలకు ప్రధానమంత్రికి బదులుగా సోనియా, కుటుంబం ఎందుకు వెళ్లింది? 1996–1998 మధ్య కాలంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించిన సీతారాం కేసరిని పంచెను కాంగ్రెస్‌ కార్యకర్తలు కిందికి లాగి ఎందుకు అవమానించి, పదవి నుంచి తప్పించారు? అనే ప్రశ్నలకు సైతం సమాధానం చెబుతానన్నారు. 

ప్రధాని నరసింహారావుకు, సోనియా గాంధీకి ఎందుకు చెడింది? రాహుల్, ప్రియాంకలలో ఎవరి వైపు రాజకీయంగా సోనియా మొగ్గు చూపుతారు? అనే సందేహాలను సైతం నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తానని దుబే తెలిపారు. బిలాంగింగ్‌ పేరుతో రాసిన ఆత్మకథను సోనియా గాంధీ ఇటీవల విడుదల విడుదల చేయడం తెలిసిందే. అందులో తన అత్త, మాజీ ప్రధాని ఇందిర, సంజయ్‌ గాంధీ, ఆయన భార్య మేనకా గాంధీ తదితరులో సంబంధాలతోపాటు రాజకీయ రంగ ప్రవేశానికి దారి తీసిన పరిస్థితులను వివరించడం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement