ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఇక బీజేపీ తన ఆటను షురూ చేస్తుందని, ఇక కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల సంగతి చూస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను రోడ్డు మీద నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌ల్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు.
ఇక రాహుల్ గాంధీ లోకజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, భారతదేశాన్ని పదే పదే విమర్శిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 60 ఏళ్ల పాటు దేశాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని, అన్నింటిలోనూ అవినీతి చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం గురించి దేశ ప్రజలకు మొత్తం తెలుసని ఎద్దేవా చేశారు.
‘ బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు ఎలా గెలిచిందో రేవంత్ రెడ్డిని అడగండి. వచ్చే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రెండు పార్టీలు వారి గుట్టును విప్పుకుంటున్నాయి. ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటేశామని ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజల సంక్షేమానికి బీజేపీ కృషి చేస్తుంది. అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు దోపిడికి పాల్పడ్డాయి’ అని విమర్శించారు.
ఇదీ చదవండి: ‘రేవంత్.. నాపై పోటీ చేసి గెలువు..’


