నిర్మల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో అనేక రైస్ మిల్లులపై కేసులు ఉండగా, తన రైస్ మిల్లుపై మాత్రమే ఈడీ సోదాలు చేయడం వెనుక రాజకీయ దురద్దేశం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేర్కొన్నారు. తన రైస్ మిల్లుతో పాటు తన ఇంట్లో సోదాలపై రేఖా నాయక్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఇదొక రాజకీయ కుట్ర అంటూ ఆమె విమర్శించారు.
ఓ గిరిజన మహిళ నాయకురాలుపై ఎదుగుదల ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా తాను ప్రజలనుంచి వచ్చిన నాయకురాలునని, ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. ‘
నేను ప్రభుత్వానికి బాకీ ఉన్న ప్రతి రూపాయి చెల్లిస్తా. నాకు న్యాయ వ్యవస్థ పట్ల పూర్తి నమ్మకం ఉంది. ఈడి అధికారులు చేసిన విచారణకి పూర్తిగా సహకరించాను’ అని ఆమె తెలిపారు.
కాగా, నిర్మల్ జిల్లాలోని సత్తెనపల్లి గ్రామంలో ఉన్న రేఖా నాయక్‌కు చెందిన ఏఆర్‌ఎస్ ఇండస్ట్రీస్' అనే రైస్ మిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సుమారు 9,639 మెట్రిక్ టన్నుల (రూ. 40.96 కోట్ల విలువైన) ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది.
ఇదీ చదవండి: రేవంత్‌కు రాజగోపాల్‌రెడ్డి కౌంటర్.. అవినీతి, పాలనపై నిలదీత


