తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడల వేదికలు ఖరారు! | Khelo India Youth Games 2026 in Telangana, 20 Venues Finalised Across Six Districts, Government To Spend Rs 220 Crore | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడల వేదికలు ఖరారు!

Nov 20 2026 4:06 PM | Updated on Nov 20 2026 4:48 PM

Khelo India Youth Games 2026 Held In Telangana Venues Finalised

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఖేలో ఇండియా క్రీడల తాజా ఎడిషన్‌కు తెలంగాణలో వేదికలు ఖరారయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 20 వేదికలు, 27 పోటీలను ప్రభుత్వం ఫైనల్ చేసింది. హైదరాబాద్‌తో పాటు హన్మకొండ, ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్ నగర్, కరీంనగర్‌ సహా ఐదు జిల్లాలలో వేదికలను ఖరారు చేశారు.

గచ్చిబౌలి, ఓయూ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పీజేఆర్‌, ఆరాస్కిలో క్రీడలను నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఖేలో ఇండియా క్రీడల కోసం దాదాపు రూ. 220 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

కాగా డిసెంబ‌రు నెల‌లో నిర్వ‌హించ‌నున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి ఇటీవల ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి ఆహ్వాన ప‌త్రిక‌ను అందించడంతో పాటు యూత్ గేమ్స్ లోగో, మ‌స్క‌ట్‌ల గురించి వివ‌రించారు.

అదే విధంగా భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు యువ క్రీడాకారులకు ఇదొక చక్కని వేదిక కానుంద‌ని సీఎం రేవంత్‌ తెలిపారు. 2002లో జాతీయ క్రీడలు, 2007లో ప్రపంచ మిలిటరీ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన చ‌రిత్ర తెలంగాణ‌కు ఉంద‌ని వివరించారు. కాగా డిసెంబరు 11-22 మధ్య తెలంగాణలో జరిగే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ ఎనిమిదో ఎడిషన్‌లో 2400కు పైగా అథ్లెట్లు పాల్గొననున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement