అదరగొట్టిన రాహుల్‌-జైశ్వాల్‌ జోడీ.. 32 ఏళ్ల నిరీక్షణకు తెర | Yashasvi Jaiswal, KL Rahul End Indias Three Decade Wait With Terrific Opening Stand vs New Zealand | Sakshi
Sakshi News home page

NZ vs IND: అదరగొట్టిన రాహుల్‌-జైశ్వాల్‌ జోడీ.. 32 ఏళ్ల నిరీక్షణకు తెర

Nov 20 2026 2:30 PM | Updated on Nov 20 2026 2:31 PM

Yashasvi Jaiswal, KL Rahul End Indias Three Decade Wait With Terrific Opening Stand vs New Zealand

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు సత్తాచాటుతున్నారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (52 నాటౌట్), యశస్వి జైస్వాల్ (85) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన వారిద్దరూ టీ బ్రేక్ తర్వాత వన్డే మ్యాచ్ తరహాలో దూకుడుగా ఆడి పరుగుల వరద పారించారు.  

32 ఏళ్ల నిరీక్షణకు తెర  
జైస్వాల్, రాహుల్ జోడీ తొలి వికెట్‌కు 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. న్యూజిలాండ్ గడ్డపై 32 ఏళ్ల తర్వాత భారత ఓపెనర్లు నమోదు చేసిన తొలి సెంచరీ భాగస్వామ్యం ఇదే. గతంలో 1994లో హామిల్టన్ వేదికగా నయన్ మోంగియా - నవజ్యోత్ సింగ్ సిద్ధూ 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలాగే కివీస్ గడ్డపై భారత్‌కు ఇది రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 1990లో ఆక్లాండ్‌లో మనోజ్ ప్రభాకర్ - డబ్ల్యూవీ రామన్ జోడీ 149 పరుగులు జోడించింది.  

కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. 89 బంతుల్లో 16 ఫోర్లతో 85 పరుగులు చేసిన జైస్వాల్‌ను మాట్ హెన్రీ ఔట్ చేయగా, క్రీజులో రాహుల్ (52*)తో పాటు దేవదత్ పడిక్కల్ (16*) ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 368 కంటే భారత్ ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.  

అంతకుముందు న్యూజిలాండ్ 368 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో హెన్రీ నికోల్స్ (335 బంతుల్లో 175 నాటౌట్, 21 ఫోర్లు), గ్లెన్ ఫిలిప్స్ (118) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ 3 వికెట్లు, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ పడగొట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement