వెల్లింగ్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో సీనియర్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను నికోల్స్ తన వీరోచిత పోరాటంతో ఆదుకున్నారు. మొత్తంగా 335 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 21 ఫోర్ల సాయంతో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితో పాటు గ్లెన్ ఫిలిప్స్(118) కూడా శతకంతో మెరిశాడు. ఫలితంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆలౌటైంది.
నికోల్స్ సాధించిన రికార్డులు ఇవే
ఈ మారథాన్ ఇన్నింగ్స్‌తో నికోల్స్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో టెస్టుల్లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు అత్యధిక సార్లు చేసిన ప్లేయర్‌గా నికోల్స్ రికార్డులకెక్కాడు.
ఈ స్టేడియంలో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం నికోల్స్‌కు ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ క్రమంలో దిగ్గజం మార్టిన్ క్రో, కెప్టెన్ టామ్ లాథమ్ రికార్డులను నికోల్స్ అధిగమించాడు. వారిద్దరూ రెండు సార్లు 150కి పైగా రన్స్ సాధించారు.
బేసిన్ రిజర్వ్ మైదానంలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (1021)ను వెనక్కి నెట్టి నికోల్స్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ మైదానంలో నికోల్స్ ఖాతాలో ప్రస్తుతం 1098 పరుగులు ఉన్నాయి.
ఈ జాబితాలో కేన్ విలియమ్సన్ (1591) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌పై సాధించిన 175* పరుగులు నికోల్స్ టెస్టు కెరీర్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


