వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ భారత తుది జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. నలుగురు పేసర్లతో బరిలోకి దిగినప్పటికి సిరాజ్‌కు మాత్రం ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్‌మెంట్ నిర్ణయంపై భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సిరాజ్‌ను పక్కన పెట్టడం అన్యాయమని అజారుద్దీన్ అన్నారు.
"భారత తుది జట్టులో మహ్మద్ సిరాజ్ లేకపోవడం నాకు ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా బుమ్రా లేని సమయంలో జట్టుకు అతడు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ప్రతీస మ్యాచ్‌లోనూ అతడు నిలకడగా రాణించాడు. అన్షుల్ కాంబోజ్‌కు అవకాశమివ్వడాన్ని నేను తప్పపట్టను.
కానీ అదే సమయంలో సిరాజ్ వంటి సీనియర్ బౌలర్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ నిర్ణయంపై సిరాజ్‌కు తగిన స్పష్టత, గౌరవం ఇచ్చి మేనేజ్‌మెంట్ వివరించిందని ఆశిస్తున్నాను. లేదంటే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం" ఉంది అని అజారుద్దీన్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
కాగా సిరాజ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్ పర్యటనలో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. సిరాజ్ 5 మ్యాచ్‌లలో 32.43 సగటుతో ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్, ఒక నాలుగు వికెట్ల ప్రదర్శన ఉన్నాయి. ముఖ్యంగా ఓవల్ టెస్ట్ ఐదో రోజు ఉత్కంఠభరిత స్థితిలో 3 వికెట్లు తీసి భారత్ 6 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.
చదవండి: SA Vs BAN: సౌతాఫ్రికా ప్లేయర్ సరికొత్త ప్రపంచ రికార్డు


