ఘోర రోడ్డు ప్రమాదం.. చేయి కోల్పోయిన కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత | Commonwealth Games Gold Medallist Weightlifter From Malaysia Loses Arm In Motorbike Crash | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. చేయి కోల్పోయిన కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత

Nov 19 2026 1:28 PM | Updated on Nov 19 2026 2:00 PM

Commonwealth Games Gold Medallist Weightlifter From Malaysia Loses Arm In Motorbike Crash

source: X

మలేషియాకు చెందిన ప్రముఖ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత మొహమ్మద్ హఫీజుద్దీన్ రోస్లిన్ (21) ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడి కుడి చేతిని వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని మలేషియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అధ్యక్షుడు అయూబ్ రెహ్మత్ వెల్లడించాడు. 

శారీరకంగా కోలుకుంటున్నప్పటికీ ఈ ఘటన హఫీజుద్దీన్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందని అయూబ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. మలేషియా వెయిట్‌లిఫ్టింగ్ క్రీడకు ఇది తీరని లోటని పేర్కొన్నాడు. హఫీజుద్దీన్ వైద్య ఖర్చులన్నింటినీ మలేషియా ప్రభుత్వం భరించనుందని స్పష్టం చేశాడు. నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ (ఎన్ఎస్‌సీ) ద్వారా అతడికి బీమా ప్రయోజనాలు కూడా అందనున్నాయని వెల్లండించాడు.

కాగా, గతేడాది జులైలో గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 88 కేజీల విభాగంలో హఫీజుద్దీన్ స్వర్ణ పతకం సాధించాడు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించే సత్తా ఉన్న యువ అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. ఇంతలోనే ఈ ప్రమాదం అతడి క్రీడా భవిష్యత్తును అంధకారంగా మార్చింది.

ఇదీ చదవండి: గెలుపు బాటలో ఉన్న పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement