Photo Credit: Twitter
ఆసియా గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణం నిలబెట్టుకుంది. శనివారం జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 తేడాతో మలేషియాను చిత్తు చేసింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ డబుల్ గోల్స్‌తో మెరవగా, జుగ్‌రాజ్ సింగ్, హార్దిక్, శిలానంద్ తలా ఒక గోల్ కొట్టారు. మలేషియా తరఫున ఏకైక గోల్ షెల్లో సిల్వెరియస్ సాధించాడు.

2028 ఒలింపిక్స్‌కు అర్హత..
ఆసియా గేమ్స్‌లో వరుసగా రెండోసారి స్వర్ణం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు చరిత్రను తిరగరాసింది. ఇక ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత హాకీ జట్టు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. ఈసారి ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది 21వ స్వర్ణం కాగా.. ఓవరాల్‌గా 85 పతకం. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలున్నాయి. 21వ స్వర్ణంతో ఉజ్బెకిస్తాన్‌ను దాటిన భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఆసియా గేమ్స్‌లో భారత్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే.
ఐదో స్వర్ణం
ఇక భారత పురుషుల హాకీ జట్టుకు ఆసియా గేమ్స్‌లో ఇది ఐదో స్వర్ణం. గతంలో 1966, 1998, 2014, 2023లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల హాకీ జట్టు వరుస ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించడం మాత్రం ఇదే తొలిసారి. శుక్రవారం భారత మహిళల హాకీ జట్టు కూడా 44 ఏళ్ల నిరీక్షణ తర్వాత స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.
चक दे इंडिया!
Heartiest congratulations to the Indian Men’s Hockey Team on winning the Gold Medal at the #AsianGames2026 & successfully defending their title!
With this triumph, India also secures direct qualification for the LA 2028 Olympics.
A magnificent achievement for… pic.twitter.com/rsrJ3QMe0w— Kiren Rijiju (@KirenRijiju) October 3, 2026
ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌లో స్వర్ణం.. సుందర్‌కు భారీ నజరానా


