ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ 2026–27 దేశవాళీ సీజన్ కోసం తమ జట్లను ప్రకటించింది. సీనియర్ రంజీ జట్టు కెప్టెన్‌గా ఆయుష్ బదోని ఎంపిక కాగా.. అండర్ జట్టు సారథ్య బాధ్యతలను వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌కు అప్పగించారు.
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో భాగంగా ఢిల్లీ సీనియ్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 11న ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగాల్‌తో తలపడనుంది. అదేవిధంగా అండర్-19 జట్టు వినూ మన్కడ్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 8న విశాఖపట్నం వేదికగా గుజరాత్‌తో తలపడనుంది.
కాగా రంజీ జట్టు ఎంపిక సందర్భంగా కె.పి. భాస్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. యువ ఆటగాడు యశధుల్‌ను ఆయష్ బదోని డిప్యూటీగా నియమించారు. అదేవిధంగా వికెట్ కీపర్ అనుజ్ రావత్‌కు ప్రత్యామ్నాయంగా ప్రణవ్ రాజవంశీని సెలక్టర్లు ఎంపిక చేశారు.
మరోవైపు స్టార్ ప్లేయర్ సార్థక్ రంజన్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టులో ఆర్యన్ రానా, రోహన్ రానాలకు చోటు దక్కలేదు. ఈ జట్టులో నవదీప్ సైనీ, సిమర్‌జీత్ సింగ్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు.
సూపర్ ఫామ్‌లో ఆర్యవీర్
ఇక ఢిల్లీ అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఎంపికైన ఆర్యవీర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఆసీస్ అండర్-19 టీమ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా ఈ జూనియర్ సెహ్వాగ్ ఆకట్టుకున్నాడు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో కూడా అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. మేఘాలయపై 309 బంతుల్లో 51 బౌండరీలతో సహా 297 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే అతడికి జూనియర్ జట్టు పగ్గాలను సెలక్టర్లు కట్టబెట్టారు.


