ఫాస్టెస్ట్‌ సెంచరీ.. సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్‌ | Shubman Gill Hits Stunning Century vs West Indies in 2nd ODI! | Sakshi
Sakshi News home page

Shubman Gill: ఫాస్టెస్ట్‌ సెంచరీ.. సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్‌

Sep 30 2026 8:20 PM | Updated on Sep 30 2026 8:41 PM

Shubman Gill Hits Stunning Century vs West Indies in 2nd ODI!

గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. విండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గిల్ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ఉతికేసాడు.  

ఈ క్రమంలోనే గిల్ కేవలం 63 బంతుల్లోనే (10 ఫోర్లు, 5 సిక్సర్లు) తన వన్డే కెరీర్‌లో 11వ శతకాన్ని అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో వెస్టిండీస్‌పై అత్యంత వేగంగా (ఫాస్టెస్ట్) సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాడిగా శుబ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.  

సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు
ఇప్పటివరకు ఈ అరుదైన రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండేది. 2011లో ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెహ్వాగ్ 69 బంతుల్లో సెంచరీ సాధించాడు. తాజాగా గిల్ తన సంచలన ఇన్నింగ్స్‌తో సెహ్వాగ్ పేరిట ఉన్న ఈ 15 ఏళ్ల నాటి ఆల్‌‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
చదవండి: టీమిండియా కెప్టెన్‌ వరల్డ్‌ రికార్డు.. సచిన్‌కూ సాధ్యం కాలేదు



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement