విండీస్‌తో రెండో వన్డే.. చరిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ | Rohit Sharma Record-Fewest Inning-Complete-12000 Runs-ODI-Cricket | Sakshi
Sakshi News home page

IND Vs WI: విండీస్‌తో రెండో వన్డే.. చరిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ

Sep 30 2026 8:04 PM | Updated on Sep 30 2026 8:48 PM

Rohit Sharma Record-Fewest Inning-Complete-12000 Runs-ODI-Cricket

Photo Credit: BCCI Twitter

గౌహ‌తి వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ రికార్డుల మీద రికార్డులు కొల్ల‌గొడుతున్నాడు. 73 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద రోహిత్ వ‌న్డేల్లో 12వేల ప‌రుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ మార్క్ చేరుకునేందుకు రోహిత్‌కు 282 ఇన్నింగ్స్‌లు అవ‌స‌ర‌మ‌య్యాయి.

తద్వారా 12వేల పరుగులు పూర్తి చేసేందుకు తక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకున్న రెండో బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ కంటే కోహ్లి (242 ఇన్నింగ్స్‌లు) ముందున్నాడు. ఇక సచిన్ టెండూల్కర్ (300 ఇన్నింగ్స్‌లు), పాంటింగ్ (314 ఇన్నింగ్స్‌లు), సంగ్కకర (336 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక వన్డే క్రికెట్‌లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్నారు. 2007లో వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 289 మ్యాచ్‌లు ఆడాడు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement