గజ గజ వణికిన ప్రయాణీకులు : ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో సంబరాలు, వీడియో | Passengers Clap Hoot As flydubai Flight Lands After Hijack Scare | Sakshi
Sakshi News home page

గజ గజ వణికిన ప్రయాణీకులు : ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో సంబరాలు, వీడియో

Sep 30 2026 6:39 PM | Updated on Sep 30 2026 7:25 PM

Passengers Clap Hoot As flydubai Flight Lands After Hijack Scare

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన 'ఫ్లైదుబాయ్' (flydubai) ప్రయాణికుల విమానంలో  అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విమానం సౌదీ అరేబియాలోని తబూక్ (Tabuk) విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండ్‌ చేశారు. దీంతో ప్రయాణికుల సంబరాలు చేసుకున్నారు. ఇంత సంక్షోభం మధ్య విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేసిన  పైలట్‌కు  సిబ్బందికి  కృతజ్ఞతలు తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తబూక్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హెబ్రూ భాషలో "మా తండ్రి ఇంకా జీవనే ఉన్నారు" అని అర్థం వచ్చే "ఒడ్ అవిను చాయ్" (Od Avinu Chai) అనే గీతాన్ని పాడుతూ కేరింతలు కొట్టారు. గాయపడిన పైలట్  వీరత్వాన్ని ప్రయాణికులుప్రశంసిస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని, సంబంధిత అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది.

పైలట్ల మధ్య గొడవ, వణికిపోయిన  ప్యాసింజర్స్‌ 
ఇజ్రాయెల్ మీడియా, భద్రతా అధికారుల కథనం ప్రకారం, విమాన కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య వివాదం తలెత్తి అది శారీరక ఘర్షణకు దారితీసింది. ప్రయాణికులు ముందు భాగం నుంచి కేకలు, అరుపులు వినపడినట్లు తెలిపారు. కొంతమంది ప్రయాణీకులు కూడా జోక్యం చేసుకకుని వారిని శాంతింప చేసినట్టు  తెలుస్తోంది.  గాయపడిన పైలట్‌కు ప్రయాణికులు కాపలాగా ఉన్నారు. ఈ ఘర్షణలో ఒక ప్రయాణికుడి టీ-షర్ట్‌కు రక్తపు మరకలు అయినట్లు ఫొటోలు వైరల్‌ అయ్యాయి. FlightRadar24 డేటా ప్రకారం, దుబాయ్ నుండి బయలుదేరిన సుమారు రెండున్నర గంటల తర్వాత, ఈ విమానం కేవలం నిమిష వ్యవధిలోనే సుమారు 33,000 అడుగుల నుండి 17,000 అడుగులకు అకస్మాత్తుగా పడిపోయింది.

 

ఉద్దేశపూర్వక కుట్ర కోణం 
విమానంలో ఏదో అసాధారణ ఘటన జరగడంతో పాటు ఒక ప్రయాణికుడు వీడియోలో 'విమానం హైజాక్ అయింది' అని చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది ఉగ్రదాడి కావచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.పైలట్లలో ఒకరు విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేయడానికి ప్రయత్నించగా, మరో పైలట్ దాన్ని అడ్డుకున్నారా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎయిర్‌లైన్స్ లేదా సంబంధిత దేశాలు అధికారికంగా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

హైజాక్ లేదా ఇజ్రాయెల్ ప్రజలపై దాడి జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో ఇజ్రాయెల్ వెంటనే తన యుద్ధ విమానాలను (Fighter jets) గాల్లోకి దించింది. అయితే కొద్దిసేపటి తర్వాత హైజాక్ వార్తలను, అనుమానాలను అధికారులు తోసిపుచ్చారు.

ఇదీ చదవండి : మీరట్ బ్లూ డ్రమ్ కేసు : కోర్టు సంచలన తీర్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement