సాక్షి, న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంతో తాజాగా జరిగిన ఓ పరిణామం తీవ్ర కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. విమానం తొలుత ఎమర్జెన్సీ కోడ్ పంపింది. కొద్దిసేపటికే హైజాక్ కోడ్ పంపడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దళం యుద్ధవిమానాలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073 దుబాయ్ నుంచి టెల్‌అవీవ్ వెళ్తుండగా ఈ గందరగోళం నెలకొంది. జోర్డాన్ గగనతలంలో ఉండగా.. వరుసగా 7700 ఎమర్జెన్సీ కోడ్, ఆ తర్వాత కాసేపటికే 7500 హైజాక్ కోడ్‌లు వచ్చాయి. కాసేపటికే విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి మళ్లి టబుక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో సుమారు 200 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
🚨✈️🇦🇪🇮🇱 Un vol Flydubai reliant Dubaï à Tel-Aviv a déclenché le code d’urgence signalant un possible détournement alors qu’il transportait environ 180 passagers.
L’appareil a été dérouté vers l’Arabie saoudite. pic.twitter.com/JCAcaidYT0— KRONIK Insights (@KRONIKInsights) September 30, 2026
పైలట్ల మధ్య గొడవ?
విమానంలో ఏం జరిగిందన్న దానిపై ప్రాథమికంగా భిన్న కథనాలు వెలువడ్డాయి. కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య భౌతికంగా గొడవ జరిగినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటన నేపథ్యంలోనే.. నొక్కుకుపోయి ఎమర్జెన్సీ సిగ్నల్ పంపినట్లు సమాచారం. 7500 కోడ్ సాధారణంగా హైజాక్ సమయంలో ఉపయోగిస్తారు. అందుకే ఇజ్రాయెల్ అధికారులు తొలుత అప్రమత్తమయ్యారు. అయితే అసలు విమానంలో ఏం జరిగిందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
UPDATE: The plane has landed safely in Saudi Arabia. The assessment in Israel is that the emergency signal on the plane was activated during a violent altercation between the pilots in the cockpit, and not due to a highjacking. https://t.co/Cz2W33I5qO
— Ariel Oseran أريئل أوسيران (@ariel_oseran) September 30, 2026
విమాన సిబ్బంది పొరపాటున 7500 కోడ్ పంపారా? కాక్‌పిట్‌లో జరిగిన ఘటన కారణంగానే ఆ కోడ్ వెళ్లిందా? లేదంటే మరేదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. విమానంలో ఉన్న ప్రయాణికుల పరిస్థితిపై మాత్రం తీవ్ర ప్రమాదం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.
ఇదీ చదవండి: ఇండియన్ సినిమాలు.. ఓ ఆటాడుకుంటున్న ఇరాన్!


