breaking news
Tel Aviv
-
ఇరాన్ అణు ముప్పును తొలగించాం: నెతన్యాహు
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించింది. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్ అణు-క్షిపణి ముప్పును తొలగించడంలో విజయం సాధించాం అని పేర్కొన్నారాయన. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. ‘‘ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించాం. తద్వారా ముప్పును తొలగించగలిగాం. ఈ విషయంలో సహకరించడంతో పాటు రక్షణ సహకారం అందించిన ట్రంప్‌నకు కృతజ్ఞతలు. ఈ విజయానికి ప్రతిగా.. ట్రంప్‌నకు పూర్తి సహకారం అందిస్తాం. ఆయన ప్రతిపాదించిన పరస్పర కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాం.’’ అని నెతన్యూహు పేర్కొన్నారు. అయితే.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనుక ఇజ్రాయెల్ ధీటుగానే స్పందిస్తుందని ఇరాన్‌ను హెచ్చరించారాయన. అయితే నెతన్యాహు అణు ముప్పు తొలగిందన్న వ్యాఖ్యలకు ఇరాన్ స్పందించాల్సి ఉంది.12 రోజుల యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే తొలుత ఇరాన్ ఈ ప్రకటనను తోసిపుచ్చుతూ.. భిన్నమైన ప్రకటనలు చేసింది. ఈలోపు మంగళవారం ఉదయం ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో యుద్ధం కొనసాగుతోందని అంతా భావించారు. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే కాల్పుల విరమణ మొదలైందని టెహ్రాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించగా.. కాసేపటికే ఇజ్రాయెల్ కూడా ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. 24 గంటల్లో తొలి 12 గంటలు ఇరాన్ కాల్పుల విరమణ పాటించాలి. ఆ తర్వాత 12 గంటలు ఇజ్రాయెల్ ఒప్పందాన్ని పాటిస్తుంది. దీంతో కాల్పుల విమరణ ఒప్పందం సంపూర్ణంగా అమలు అయినట్లే. అయితే ఇది శాశ్వత పరిష్కారమా? కాదా? అనేదానిపై మరికొన్ని గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
పశ్చిమాసియా యుద్ధవాతావరణానికి ఎట్టకేలకు తెరపడింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసింది!. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు.. ఈ ప్రకటన చేసే చివరి నిమిషం వరకూ ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు కొనసాగించడం గమనార్హం.ఇరాన్- ఇజ్రాయెల్ (Iran- Israel) మధ్య కాల్పుల విరమణ జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ ఒప్పందానికి సంబంధించి తాజాగా ఆయన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందని, ఎవరూ ఉల్లంఘించొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు. తొలుత ఇరాన్, ఆపై ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తాయని, 24 గంటల్లో ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించలేదు. అయితే బంకర్లలో దాక్కున్న తమ దేశ పౌరులను బయటకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యుద్ధం ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. అంతకు ముందు.. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఒకేశారి ‘శాంతి’ అంటూ తన వద్దకు కాళ్లబేరానికి వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడ శాంతి అవసరం ఉందని తాను గుర్తించానన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం కూడా నిజమైన విజయం సాధించిందన్నారు. ఇరుదేశాలు భవిష్యత్తులో ప్రేమ, శాంతి శ్రేయస్సును చూస్తాయని తెలిపారు. అలా కాదని వారు నీతిని, సత్య మార్గాన్ని వదులుకుంటే రానున్న రోజుల్లో మరింత కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈలోపు ఇరాన్ ట్విస్ట్ ఇచ్చింది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదంటూనే.. ఒప్పందానికి సుముఖంగా ఉన్నట్లు, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తామూ దాడులు ఆపుతామంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి సూచనప్రాయంగా పోస్టులు చేశారు. మరోవైపు.. ‘‘ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్‌లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది.ఆపై కొన్ని గంటల్లోనే టెల్‌అవీవ్‌పై టెహ్రాన్ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. దీంతో పశ్చిమాసియలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతాయని భావించేలోపే.. కాసేపటికే ట్విస్ట్ ఇస్తూ ఇరాన్ కాల్పుల విరమణ మొదలైందంటూ ప్రకటన చేయించడం గమనార్హం. ఇరుదేశాల ఒప్పందం వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. -
అమెరికా ఎఫెక్ట్.. ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపించిన ఇరాన్
Iran-Israel Conflict Updates..ఇజ్రాయెల్ విమానాశ్రయంపై దాడి..బెన్ గురియన్ విమానాశ్రయంపై దాడి ఇరాన్ దాడి..ఇజ్రాయెల్ అంతటా జరిగిన దాడుల్లో 11 మందికి గాయాలువిమానాశ్రయంలో సహాయక చర్యలు ప్రారంభం.బాధిత ప్రాంతాలలో అత్యవసర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ విధింపు..ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైల్స్‌తో ఇరాన్ దాడులుఇరాన్ దాడులతో ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వంఇజ్రాయెల్లోని జెరూసలెంలో భారీ పేలుడుఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలుమధ్య ఇజ్రాయెల్‌లోని నివాస ప్రాంతాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసంఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం.ఇళ్లు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసంకొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళంప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనున్న ఇరాన్ నిర్ణయంఅమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు పిలుపునిచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడుఇరాన్ భీకర దాడులు..ఇరాన్‌పై అమెరికా దాడులు చేసిన వేళ.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ జెరూసలేం, టెలీ అవీవ్ టార్గెట్‌గా ఇరాన్ మరోసారి భారీ దాడులు చేసింది. భారీ క్షిపణుల కారణంగా పేలుళ్లు జరిగాయి. ముప్పెట దాడితో ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపించింది. ఇరాన్ దాడుల సందర్భంగా టెలీ అవీవ్ సహ పలు ప్రాంతాల్లో సెరన్లు మోగాయి. దాదాపు 400 ప్రాంతాల్లో సెరన్లు మోగినట్టు తెలుస్తోంది. దీంతో, ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇజ్రాయెల్ పౌరులకు హెచ్చరికఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. పౌరులందరూ షెల్టర్ హోమ్స్‌లోనే ఉండాలని.. హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచనలను పాటించాలని సూచించింది. క్షిపణి దాడుల కారణంగా అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.🚀🇮🇱 BOOM BOOM TEL AVIV pic.twitter.com/1SkPBhqFDW— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) June 22, 2025 ఇజ్రాయెల్ గగనతలం మూసివేత..ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే, ఈజిప్ట్, జోర్డాన్‌తో భూ సరిహద్దు క్రాసింగ్‌లు తదుపరి నోటీసు వచ్చే వరకు తెరిచే ఉంటాయని తెలిపింది.İran füzelerinin bu sabah Hayfa'ya düşmesinden kısa bir süre sonra çekilen görüntüler.pic.twitter.com/q8FG2BCvAJ— Brez Kantonyan (@barikatzaferi) June 22, 2025 🇮🇱🇮🇷 | Así se encuentra la ciudad de Tel Aviv tras el bombardeo Iraní de la última hora. pic.twitter.com/6CSsgyxWYX— Vibe News (@vibe_news_) June 22, 2025అమెరికాలో హైఅలర్ట్.. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తపడుతోంది. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. వాషింగ్టన్‌తో సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇరాన్లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. Kuzeydeki Hayfa'dan Tel Aviv, Kudüs ve Ölü Deniz'e kadar 400 şehirde sirenler çalıyor. pic.twitter.com/vFJ52z0BQ2— Brez Kantonyan (@barikatzaferi) June 22, 2025#SONDAKİKA | İran, Tel Aviv ve Hayfa'yı vurdu.Fatih Altaylı İsrail İran tel aviv Nihal candan yks 2025 pic.twitter.com/q3k1kXKDpM— Efbhaber (@efbhaber) June 22, 2025 -
ఇజ్రాయెల్-స్ట్రైకర్.. ఇరాన్ ఫతా ఎంత డేంజరో తెలుసా?
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ ప్రజల పట్ల కనికరం చూపించే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఈ క్రమంలోనే శక్తివంతమైన హైపర్సోనిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ప్రకటించారాయన. మరోవైపు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా ‘ఫతా-1 మిస్సైల్స్’ను ప్రయోగాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ క్షిపణి అంత శక్తివంతమైందా? దాని సామర్థ్యం ఏపాటిదో ఓ లుక్కేద్దాం. ఫతా(Fattah) హైపర్సోనిక్ మిస్సైల్.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించుకుంది. అయితే ఈ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన పని. ఇరాన్ గతంలో రష్యా, చైనా వంటి దేశాలతో రక్షణ రంగంలో పరస్పర సహకారం కొనసాగించింది. బహుశా ఈ దేశాల భాగస్వామ్యంతోనే ఫతాను రూపొందించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే.. ఈ క్షిపణి అభివృద్ధితో అమెరికా, రష్యా, చైనా తర్వాత హైపర్సోనిక్ క్షిపణి కలిగిన నాలుగో దేశంగా ఇరాన్ నిలిచింది. అలాగని ఇజ్రాయెల్ మీదకు ఫతా హైపర్సోనిక్ మిస్సైల్స్‌ను ఇరాన్ ప్రయోగించడం ఇప్పుడే తొలిసారేం కాదు!. కిందటి ఏడాది అక్టోబర్ 1వ తేదీన జరూసలేం మీదకు ఈ క్షిపణలను ప్రయోగించినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇటు ఇరాన్, అటు ఇజ్రాయెల్ ఈ ప్రచారంపై ఇప్పటిదాకా మౌనం వీడలేదు. అయితే తాజాగా మాత్రం ఇరాన్ అధికారిక ప్రకటనతో వీటి ప్రయోగం జరిగిందన్న విషయం వెలుగు చూసింది. హైపర్సోనిక్ అనే పదాన్ని సాధారణంగా అత్యంత వేగమైన రవాణా వ్యవస్థకు ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాతి కాలంలో అది యుద్ధ రంగానికి అన్వయించడం మొదలుపెట్టారు. హైపర్ సోనిక్ మిస్సైల్స్ అంటే.. అత్యాధునికమైన క్షిపణులు అని అర్థం. ఇవి శబ్ధ వేగం కంటే అధిక రెట్లతో ప్రయాణిస్తాయి. అత్యంత వేగంతో ప్రయాణించడం వల్ల శత్రుదేశాలు గుర్తించడంగానీ, మార్గంమధ్యలోనే నాశనం చేయడంగానీ చాలా కష్టం. ఫతాను 2003లో ఇరాన్ ఆవిష్కరించింది. దీనికి ఆ పేరు పెట్టింది ఇరాన్ సుప్రీం ఖమేనీనే. దీని పొడవు 12 మీటర్లు. 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది చేధించగలదు. సుమారు 200 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. శబ్ద వేగం కంటే 13 నుంచి 15 రెట్లు అధికంగా ఇది ప్రయాణించగలదు. అంటే దాదాపు గంటకు 16,000–18,500 కిలోమీటర్లు వేగం ఉంటుందన్నమాట. ఇది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికిల్ (HGV), హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ (HCV) లక్షణాలను కలిగి ఉంది. కానీ, ఫతా సామర్థ్యానికి సంబంధించిన సరైన వివరాలను ఇరాన్ ఇప్పటిదాకా వెల్లడించకపోవడం గమనార్హం. కాకుంటే.. ఐరన్ డోమ్, ఆరో లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్న ఇజ్రాయెల్‌కు సైతం ఈ క్షిపణి అంతు చిక్కదు. అందుకే ఇరాన్ దీనిని ముద్దుగా ఇజ్రాయెల్-స్ట్రైకర్ అని అభివర్ణిస్తుంటుంది. ఇజ్రాయెల్ మాత్రమే కాదు.. హిందూమహాసముద్రంలో సంచరించే అమెరికా యుద్ధ నౌకలను కూడా ఇది ఆనాశనం చేయగలదని ఇరాన్ తరచూ ధీమాగా చెబుతుంటుంది. తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల గగన తలాలను పూర్తిగా ఇరాన్ తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగిందంటే మాత్రం.. అందుకు ఫతాలాంటి హైపర్సోనిక్ మిస్సైల్ కారణం. -
Iron Dome: రక్షణ కవచాన్ని చీల్చుకుని మరీ..
దాడులు చేయడమే తప్ప.. దెబ్బ తినడం తెలియని ఇజ్రాయెల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఐరన్ డోమ్(Iron dome). నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది. అలాంటిది ఆ వ్యవస్థ మరోసారి విఫలమైందనే చర్చ నడుస్తోంది. ఇరాన్ అణు ముప్పును తప్పించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు శుక్రవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ సైన్యం(IDF). ప్రతిగా ఇరాన్ కూడా దాడులు జరిపింది. డ్రోన్లతో జరిపిన దాడులను ఐడీఎఫ్ తిప్పికొట్టగలిగింది కానీ.. క్షిపణుల దాడిలో మాత్రం దెబ్బ తింది. ఏకంగా రాజధాని టెల్ అవీవ్‌లో.. అదీ రక్షణ ప్రధాన కార్యాలయంపై దాడి జరగ్గా.. ఏ రక్షణ వ్యవస్థ అడ్డ్డుకోలేకపోయింది.#BreakingNews Iron Dome Blasts Iranian Drone Out Of The Sky#Israel #Iran #IsraeliranWar #israil #Tehran #Teheran #TelAviv #deathtoamerica #irannucleardeal #AsadabadRegion #IronDome pic.twitter.com/wEV5FsM2qD— Shekhar Pujari (@ShekharPujari2) June 14, 2025ఆకాశంలో క్షిపణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్ ప్రజలు ఏమాత్రం వణికిపోకుండా తమ పని తాము చేసుకుంటారు. ఎందుకంటే ఐరన్ డోమ్ ఉందనే ధైర్యం. కానీ, శనివారం భీకర యుద్ధంలో ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. ఈ క్రమంలో రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌ను చీల్చుకుంటూ మరి మిస్సైల్స్ దూసుకెళ్లాయి. Last night strike on Tel aviv.Follow us for for all latest updates #middleeast #riyadh #jeddah #IranNuclearSecrets #USA #Israel #SaudiArabia #UAE #iran #tehran #tahran #russia #ukraine#telAviv #MissileAttack #Irondome pic.twitter.com/sRvxNzvXPy— Bharat - As it is (@NewBharatVoice) June 14, 2025పెద్ద శబ్దంతో.. దూసుకొచ్చిన మిస్సైల్ సెకన్ల వ్యవధిలోనే భవనాన్ని తాకింది. ది టైమ్స్ ఈ 19 సెకన్ల వీడియోను ధృవీకరించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో టెల్ అవీవ్‌కు తలమానికంగా భావించే కీర్యా ప్రాంతంను చూడొచ్చు. ఇరాన్ మిస్సైల్స్‌ను ఐరన్ డోమ్ అడ్డుకుంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. మిస్సైల్ నేరుగా రక్షణ కార్యాలయాన్ని ఢీ కొట్టింది. అయితే అక్కడ జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగిస్తే రాడార్ వ్యవస్థ దాన్ని అధ్యయనం చేస్తుంది. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్‌ను అడ్డుకుంటాయి. అయితే శనివారం నాడు నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ఇరాన్ ప్రయోగించింది. కానీ, వాటిని అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ పవిఫలమైంది. ఐరన్ డోమ్ ఉండేది అక్కడే..ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఒకే దశలో ఉండదు. ఇందులో మూడు దశలు ఉంటాయి. యారో-2, యారో-3 సిస్టమ్స్‌ను బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఇవి ఆకాశంలోనే బాలిస్టిక్ క్షిపణులను పేల్చేసి.. వాటి శకలాల నుంచి ముప్పును దూరం చేస్తాయి. ఆపై డేవిడ్ స్లింగ్ మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. 100-200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి వాడతారు. అంతేకాదు.. యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చేయడంలోనూ దీనిదే కీలక పాత్ర.ఇక.. చిట్టచివరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. దీనిని ఇజ్రాయెల్ విస్తృతంగా వాడుతుంది. హమాస్, హెజ్బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్‌కు అసలైన రక్షణ కవచంగా నిలిచింది. దూసుకొచ్చే ఒక్కో ముప్పును పేల్చేయడానికి రెండు క్షిపణులను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50 వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. పని చేసేది ఎలాగంటే..ఐరన్ డోమ్‌ను స్థానికంగా కిప్పాట్ బర్జెల్‌గా వ్యవహరిస్తారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. దీనిలో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ ఉంటాయి. రాడార్ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే.. వదిలేస్తుంది. అదే జనావాసాలు అయితే మాత్రం. రాకెట్‌ను ప్రయోగించి దానిని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టమ్, రఫెల్ సంస్థలు పనిచేశాయి.సక్సెస్ రేటుపై అనుమానాలా?2006లో హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. నాడు వేల రాకెట్లను ఆ సంస్థ టెల్ అవీవ్ పై ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొంది. దీంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌కు తయారీకి నిర్ణయించింది. దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. 2008 నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011 నాటికి అందుబాటులోకి తెచ్చింది. ఐరన్ డోమ్ సక్సెస్ రేటు 90శాతానికి పైగానే ఉంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఇదో అద్భుతం. అయితే 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులను, తాజా ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ తడబడింది. -
ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులు జరిపాం: హౌతీ రెబల్స్
ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సమీపంలో డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించాయి. గురువారం ఉదయం ఆక్రమిక పాలస్తీనాలోని జాఫా (టెల్ అవీవ్) ప్రాంతంలో పలు కీలక లక్ష్యాలను టార్గెట్ చేసి మరీ డ్రోన్ ఆపరేషన్ చేపట్టినట్లు హౌతీరెబల్స్ తెలిపాయి. తాము ప్రయోగించిన డ్రోన్లను ఇజ్రాయెల్ ఎదుర్కోకపోయింది. దీంతో తాము చేసిన డ్రోన్ దాడుల ఆపరేషన్ విజయవంతమైనట్లు పేర్కొంది.Yemen’s Houthi group says it “achieved its goals” in a drone attack on Tel Aviv, although there was no confirmation from Israeli authorities.“The operation achieved its goals successfully as the drones reached their targets without the enemy being able to confront or shoot them… pic.twitter.com/izNdIn7eAa— GAROWE ONLINE (@GaroweOnline) October 3, 2024 క్రెడిట్స్: GAROWE ONLINEయెమెన్ హౌతీ రెబల్స్ డ్రోన్ దాడులను ఇప్పటివరకు ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించకపోవటం గమనార్హం. గత రాత్రి అనుమానాస్పద వైమానిక టార్గెట్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయకంటే ముందే హౌతీలు ఇజ్రాయెల్‌పై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు బుధవారం పేర్కొంది.యెమెన్‌లోని చాలా ప్రాంతాలను నియంత్రించే హౌతీ తిరుగుబాటుదారులు.. హమాస్‌పై మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌కు మద్దతు ఇచ్చే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌లో హౌతీ రెబల్స్ ఓ భాగం. ఇటీవల యెమెన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహిస్తుండగా .. ఇజ్రాయెల్ నగరాలపై హౌతీ రెబల్స్ క్షిపణులు ప్రయోగించి దాడులు చేశాయి.చదవండి: ‘హత్యకు ముందే కాల్పుల విరమణకు నస్రల్లా అంగీకారం’ -
ఇజ్రాయెల్ Vs హమాస్: మళ్లీ యుద్ధ మేఘాలు.. దూసుకెళ్లిన రాకెట్స్
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ టార్గెట్‌గా హామాస్ రాకెట్లను ప్రయోగించింది. ఈ క్రమంలో టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.వివరాల ప్రకారం.. హమాస్ అగ్రనేత హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు హమాస్ సిద్ధమవుతోంది. ఈక్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. ఈ సందర్బంగా హమాస్‌కు చెందిన సాయుధ అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్.. టెలీ అవీవ్ టార్గెట్‌గా M90 రాకెట్స్‌ను ప్రయోగించింది. హమాస్ రాకెట్ల దాడికి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ మేరకు పేలుళ్ల శబ్ధం కూడా వినిపించినట్టు ఇజ్రాయెల్ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, హమాస్ రాకెట్ల దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మీడియా పేర్కొంది. Al-Qassam Brigades say they bombed Tel Aviv and its suburbs with two missiles #hamas #iran #Isreal#hamas #GazaGenocide #TelAviv pic.twitter.com/M3bx0PR6nZ— no love no tension (@adeelriaz1991) August 13, 2024 ఇక, హమాస్ మెరుపుదాడులతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజా హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్ మరోసారి హమాస్ టార్గెట్‌గా బాంబు వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. అయితే, ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయనుకున్న వేళ దాడులు జరగడం గమనార్హం. ⚡️ A rocket barrage now from the #Gaza Strip 🔥🔥 pic.twitter.com/ENqdAYkunF— محمّد محفوظ عالم (@md_mehfuzalam) August 13, 2024 -
ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడి.. భారీ పేలుడు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌లో శుక్రవారం(జులై 19) తెల్లవారుజామున బాంబు పేలుడు కలకలం రేపింది. రాజధాని టెల్ అవీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయ సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో ఏడుగురికి గాయాలయ్యాయి. Initial Reports suggest a Car Bomb has Exploded in the Ben Yehuda Area of Tel Aviv, near several Embassies and Diplomatic Sites including the U.S. Consulate. It is Unknown if any Building was Damaged, but Emergency Services are on Scene. pic.twitter.com/u2eig5O714— OSINTdefender (@sentdefender) July 19, 2024 గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాంబు స్వ్కాడ్ ఘటనాస్థలానికి చేరుకుంది. డ్రోన్ దాడి వల్లే పేలుడు జరిగిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) నిర్ధారించింది. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనా స్థలానికి ఎవరూ రావొద్దని సూచించారు. పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో వందల మంది మృతి చెందారు.అప్పటి నుంచి ఇజజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై అప్పుడప్పుడు రాకెట్ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. -
ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది..
న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి ఆదివారం రెండు విమానాల్లో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వీటిలో ఒక విమానం ఎయిరిండియాకు చెందినది కాగా, మరోటి స్పైస్‌జెట్ సంస్థదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 197 మందితో కూడిన మూడో విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా, 274 మంది ప్రయాణికులతో నాలుగో విమానం సాయంత్రం వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో విడుదల చేశారు. శుక్ర, శనివారాల్లో ఎయిరిండియా ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ విమా నాల్లో 435 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. తాజా తరలింపుతో యుద్ధ వాతావరణం నెలకొన్న ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో స్వదేశానికి వచ్చిన భారతీయుల సంఖ్య 900 దాటింది. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏమిటి అనగానే చాలా మంది ప్యారిస్ లేదా సింగపూర్ అని చెబుతారు. కానీ, అవి ఏవి కావు. ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ నగరం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయు) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో ఇజ్రాయిల్ నగరం టెల్ అవీవ్ తొలిసారిగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల్లో నిత్యావసర సరుకుల ధరలు, అద్దె, రవాణా వంటి ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకొని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ "వరల్డ్ వైడ్ సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్" పేరుతో ఒక జాబితాను రూపొందించింది. రవాణా, కిరాణా సరుకుల ధరలు పెరగడం వల్ల ఈ జాబితాలో టెల్ అవీవ్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, ఈ జాబితాలో పారిస్, సింగపూర్ నగరాలు ఉమ్మడిగా రెండవ స్థానంలో ఉన్నాయి. (చదవండి: దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు!) తర్వాత స్థానాల్లో జ్యూరిచ్, హాంగ్ కాంగ్ ఉన్నాయి. న్యూయార్క్ 6వ స్థానంలో, జెనీవా 7వ స్థానంలో, కోపెన్ హాగన్ 8వ స్థానంలో, లాస్ ఏంజిల్స్ 9వ స్థానంలో, ఒసాకా 10వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది సర్వే జరిపిన ఈ జాబితాలో పారిస్, జ్యూరిచ్, హాంగ్ కాంగ్‌లు ఉమ్మడిగా ప్రథమ స్థానంలో ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలలో నమోదైన ద్రవ్యోల్బణ రేటు, కరోనావైరస్ మహమ్మారి వల్ల కొన్ని దేశాలలో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆయా దేశాలలో జీవన వ్యయం కూడా అదే స్థాయిలో పెరిగింది. -
‘మరో 10 దేశాలు టచ్‌లో ఉన్నాయి’
జెరూసలేం : పవిత్ర నగరం జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా అమెరికా గుర్తించడంతో.. మరో పది దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖమంత్రి టిజిపి హోటెవెలి తెలిపారు. అందులో భాగంగా ఆయా దేశాల రాయబార కార్యాలయాలను టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మార్చేవిధంగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఐరోపా సహా మరికొన్ని దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు ఆయన చెప్పారు. పిలిప్పీన్స్, రొమేనియా, దక్షిణ సూడాన్, హోండూరస్ సహా మరికొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మార్చేసందుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రారంభమేనని.. త్వరలో మరికొన్ని దేశాలు ఇజ్రాయిల్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. జెరూసలేం విషయంలో అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి తిరస్కరించిన విషయం తెలిసిందే. -
విమానానికి బాంబు బెదిరింపు.. రక్షణగా ‘ఫైటర్లు’
టెల్ అవీవ్ : న్యూయార్క్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళుతున్న ఈఎల్ ఏఎల్ ప్యాసింజర్ విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే ఆ విమానానికి రక్షణగా స్విట్జర్లాండ్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలను మోహరించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, బాంబు బెదిరింపు తప్పుడు సమాచారమని అధికారులు తెలిపారు. -
టెల్ అవీవ్‌లో కాల్పులు, నలుగురు మృతి
ఇజ్రాయెల్: టెల్ అవీవ్ లోని నైట్ స్పాట్ వద్ద గురువారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడి ప్రజలందరూ భయభ్రాంతుయ్యారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా దళాలు టెర్రరిస్టులపై కాల్పులు జరిపాయి. దీంతో ఒకరికి గాయం కావడంతో అతనికి సర్జరీ చేసేందుకు ఆసుపత్రికి తరలించారు. మరోకరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన ఇరువురు హెబ్రాన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. రాత్రి సమయంలో దాడి కారణంగా ఆ ప్రాంతాన్నంతటిని ఖాళీ చేయించినట్లు వివరించారు. అయితే, దాడిలో గాయపడిన వారు ఇజ్రాయెల్ జాతీయులా? లేదా? అన్న సమాచారాన్ని వెల్లడించలేదు. ఇజ్రాయెల్ జరిగిన ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమాయక ప్రజలపై దాడులకు తెగబడటం వల్ల భారీగా మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు తాము అండగా ఉంటామని తెలిపింది. పాఠశాలలు, మునిసిపల్ భవనాల వద్ద భద్రత భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా, గత అక్టోబర్ లో దేశంలో జరిగిన అల్లర్ల కారణంగా207 మంది పాలస్తీయన్లు, 28 ఇజ్రాయిలీలు, ఇద్దరు అమెరికన్లు మరణించిన విషయం తెలిసిందే.