సింగపూర్‌లో భారతీయుడికి రెండేళ్ల జైలు | Indian IT vendor jailed in Singapore after risking 18016 court files | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో భారతీయుడికి రెండేళ్ల జైలు

Sep 30 2026 5:13 AM | Updated on Sep 30 2026 5:13 AM

Indian IT vendor jailed in Singapore after risking 18016 court files

ప్రభుత్వ దస్తావేజులు కాపాడటంలో రాజీ 

ల్యాప్‌టాప్‌లో అనధికార మార్పుల నేరం

సింగపూర్‌: ప్రభుత్వ రికార్డుల భద్రత విషయంలో రాజీపడ్డారన్న కారణంతో సింగపూర్‌లో ఒక భారతీయ ఐటీ కంపెనీ ఉద్యోగికి న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వమిచ్చిన ల్యాప్‌టాప్‌లో చట్టవిరుద్ధమైన మార్పులు చేయడంతోపాటు దాన్ని ఇతరులు ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించారన్న మరో రెండు నేరాల్లోనూ నిందితుడు జనార్ధనన్‌ తమిళ్‌ కోవన్‌ (42)ను దోషిగా ప్రకటించింది.  కంప్యూటర్ల తయారీ సంస్థ లెనవూలో సర్వీస్‌ డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్న జనార్ధనన్‌ను 2024 జూన్‌లో సింగపూర్‌ స్టేట్‌ కోర్టుల క్లౌడ్‌ సిస్టమ్స్‌ టీమ్‌ లీడర్‌గా నియమించారు. న్యాయస్థానాలకు సంబంధించిన వేర్వేరు వ్యవస్థలను అప్లికేష్ల నిర్వహణ బాధ్యతలు ఈ టీమ్‌ చూస్తూంటుంది. 

జనార్ధనన్‌కు ప్రభుత్వం నుంచి లెనవూ థింక్‌ప్యాడ్‌ ల్యాప్‌టాప్‌ ఒకటి ఇచ్చారు. ప్రభుత్వం, లెనవూల నియమ నిబంధనల ప్రకారం ఈ ల్యాప్‌టాప్‌లో అనధికారికంగా ఎలాంటి మార్పులు చేయకూడదు. అయితే గత ఏడాది ఆగస్టు నాలుగున జనార్ధనన్‌ ఈ ల్యాప్‌టాప్‌తో అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన ఐటీ కోర్సు పరీక్ష రాసే ప్రయత్నం చేశాడు. అయితే సెక్యూరిటీ కారణాలతో అది సాధ్యం కాలేదు. దీంతో అతడు ఈ ల్యాప్‌టాప్‌ ద్వారానే భారత్‌లో తనకు తెలిసిన హరి బాలన్‌ అనే వ్యక్తిని రిమోట్‌ డెస్‌్కటాప్‌ అప్లికేషన్‌ ద్వారా సంప్రదించాడు. 

ఐటీ కోర్సు గురించి ఇతడు గతంలోనే హరి బాలన్‌తో వాట్సప్‌లో సంప్రదింపులు జరిపినట్లు ఆధారాలున్నాయి.  హరి బాలన్‌తో కనెక్ట్‌ అయిన సమయంలో జనార్ధనన్‌ ల్యాప్‌టాప్‌లో దాదాపు 18,016 కోర్టు డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటిల్లో తక్కువ రిస్క్‌ ఉన్న ఫైల్‌ ఒకటి మాత్రమే ఉండగా... మిగిలినవన్నీ చాలా సున్నితమైన వివరాలతో కూడినవి. సింగపూర్‌ స్టేట్‌ కోర్ట్స్‌’ నెట్‌వర్క్‌ తాలూకూ లాగిన్, ఆర్కిటెక్చర్‌ తదితరాలు ఉన్నాయి.

గత ఏడాది ఆగస్టు 14న సింగపూర్‌ న్యాయవ్యవస్థ కార్పొరేట్‌ సర్వీసెస్‌ వారు రిమోట్‌ డెస్‌్కటాప్‌ అప్లికేషన్‌ను అక్రమంగా ఇన్‌స్టాల్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జనార్ధనన్‌పై కేసు నమోదైంది విచారణ సందర్భంగా జనార్ధనన్‌ తన నేరాన్ని అంగీకరించారు. దీంతో డి్రస్టిక్ట్‌ జడ్జి లొరెయిన్‌ హో అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement