ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఇండియన్ కల్చరల్ సొసైటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ (ICS) ఆధ్వర్యంలో ఐసీఎస్ కన్వెన్షన్ 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వామి రాధామనోహర్ దాస్ , తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్‌రావు, చామకూరి మల్లారెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, సాధినేని యామిని శర్మ పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, కుటుంబ విలువలను ఆస్ట్రేలియాలోని తదుపరి తరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల ప్రత్యేక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, ఇతర కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రిస్బేన్‌లోని భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


