source: X
సౌతాఫ్రికా పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయి భంగపడ్డ ఆస్ట్రేలియాకు మరిన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. చివరి మ్యాచ్ గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇద్దరు బౌలర్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. పేసర్ నాథన్ ఎల్లిస్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోయెల్ డేవిస్ రేపు జరుగబోయే మూడో వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.
ఎడ్వర్డ్స్‌పైనా అనుమానం
బౌలింగ్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా మూడో వన్డేకు ముందు హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. అతడిని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. చివరి వన్డే కోసం అతడు జట్టుతో చేరినప్పటికీ, మ్యాచ్‌లో ఆడటంపై ఇంకా స్పష్టత లేదు.
కాగా, ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి రెండు వన్డేల్లో ఆ జట్టు ఓటమిపాలైంది. మూడో వన్డే పోచఫ్‌స్ట్రూమ్ వేదికగా రేపు జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం అక్టోబర్ 9, 18, 27 తేదీల్లో డర్బన్, గ్వెబెర్హా, కేప్‌టౌన్ వేదికలుగా మూడు టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
ఇదీ చదవండి: ఆసీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియాకు భారీ ఆధిక్యం


