ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. మహిళల వ్యక్తిగత ట్రాప్ షూటింగ్‌లో నీరూ ధండా స్వర్ణ పతకం సాధించింది. దీంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
మహిళల టీమ్ ట్రాప్ విభాగంలో రజతం సాధించిన కొద్దిసేపటికే నీరూ వ్యక్తిగత విభాగంలో అద్భుత ప్రదర్శన చేసింది. వర్షం కురుస్తున్న ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె ఏమాత్రం తడబడకుండా లక్ష్యాలను ఛేదించింది.
వ్యక్తిగత షూటింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
ఈ ఆసియా గేమ్స్‌లో వ్యక్తిగత షూటింగ్ ఈవెంట్‌లో భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇదే. నీరూ తొలుత టీమ్ ఈవెంట్‌లో రజతం సాధించి, ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించడం విశేషం.
మరిన్ని పతకాలపై ఆశలు
ఇవాళ (10వ రోజు) షూటింగ్‌తో పాటు ఆర్చరీ, స్క్వాష్, టెన్నిస్, కానోయ్ స్లాలోమ్ తదితర విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడుతున్నారు.
బాక్సింగ్‌లో పర్వీన్, అంకుష్ పాంగల్, నరేందర్ సెమీఫైనల్స్‌లో బరిలోకి దిగనున్నారు. అథ్లెటిక్స్‌లోనూ గుల్వీర్ సింగ్, అవినాశ్ సేబుల్, గురిందర్‌వీర్ సింగ్, అనిమేశ్ కుజూర్ తదితరులపై భారత్ ఆశలు పెట్టుకుంది.
ఇదీ చదవండి: Asian Games 2026: షూటింగ్‌లో మరో రజతం.. 50 పతకాల దిశగా భారత్


