స్వర్ణ విజేత మహిళల కబడ్డీ జట్టు కోచ్ నీతా దడ్వేకు ఘన స్వాగతం | Coach Neeta Dadwe Accorded Grand Welcome in Hyderabad | Sakshi
Sakshi News home page

స్వర్ణ విజేత మహిళల కబడ్డీ జట్టు కోచ్ నీతా దడ్వేకు ఘన స్వాగతం

Sep 28 2026 10:15 PM | Updated on Sep 28 2026 10:15 PM

Coach Neeta Dadwe Accorded Grand Welcome in Hyderabad

Pic: Neeta dadwe instagram

హైదరాబాద్: జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టును స్వర్ణ పతకం వైపు నడిపించిన కోచ్, అర్జున అవార్డు గ్రహీత నీతా దడ్వే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, కబడ్డీ క్రీడాకారులు ఘనంగా స్వాగతం పలికారు.

భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించడంలో నీతా దడ్వే అందించిన సమర్థవంతమైన మార్గదర్శకత్వాన్ని ఈ సందర్భంగా అధికారులు, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ఆమె శిక్షణ, వ్యూహాత్మక మార్గదర్శకత్వం భారత జట్టు విజయానికి కీలకంగా నిలిచిందని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మహేందర్ రెడ్డి, సలహాదారులు జగదీశ్‌ యాదవ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ కుమార్, పీఆర్‌ఓ కాలేరు సురేశ్‌, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, కబడ్డీ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement