Photo Credit: Twitter
ఆసియా క్రీడల్లో మలేషియాతో క్వార్టర్ ఫైనల్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాటర్ నజ్ముల్ హసన్ శాంటో అనారోగ్యం కారణంగా జట్టును వీడాడు. జ్వరంతో బాధపడుతున్న నజ్ముల్ రేపు స్వదేశానికి తిరిగి రానున్నట్లు బంగ్లాదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (బీవోఏ) వెల్లడించింది. అక్టోబర్ 9 నుంచి అఫ్గానిస్తాన్ జట్టుతో బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది.
ఈ నేపథ్యంలో టెస్టు కెప్టెన్ అయిన నజ్ముల్ అనారోగ్యంతో ఆసియా క్రీడల్లో పాల్గొనడం రిస్క్ అని భావించి అతడిని వెనక్కి రావాలని ఆదేశించినట్లు బంగ్లా క్రికెట్‌బోర్డు తెలిపింది. ఇక ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన బంగ్లాదేశ్ మంగళవారం మలేషియాతో తలపడనుంది.
జపాన్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకొని బౌలింగ్‌కు ప్రాధాన్యతనివ్వనున్నట్లు కెప్టెన్ లిటన్ దాస్ అభిప్రాయపడ్డాడు. వర్షం అంతరాయంతో సరైన ప్రాక్టీస్ లేకుండానే బంగ్లాదేశ్ రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇప్పటికే భారత్, అఫ్గానిస్తాన్; పాకిస్తాన్, హాంకాంగ్‌ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ రద్దు కావడంతో మెరుగైన ర్యాంక్ ఆధారంగా దాయాది జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి.
మరో క్వార్టర్ ఫైనల్లో నేపాల్, శ్రీలంక తలపడనున్నాయి. ఒకవేళ మలేషియాతో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దయితే సెమీస్‌లో అడుగుపెట్టనున్న బంగ్లాదేశ్ అక్కడ పాకిస్తాన్‌తో ఆడనుంది. నేపాల్, శ్రీలంక మధ్య విజేతతో భారత్ మరో సెమీఫైనల్ ఆడనుంది.
ఇదీ చదవండి: జావెలిన్ త్రోలో భారత్‌కు రెండు పతకాలు; స్వర్ణం అతడిదే!


