Photo Credit: Twitter
ఆసియా గేమ్స్‌కు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దూరమైనప్పటికీ, ఈ విభాగంలో అథ్లెట్లు మన దేశానికి పతకాలు అందించారు. సోమవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్లు యశ్ వీర్ సింగ్, రోహిత్ యాదవ్‌లు రజత, కాంస్యాలతో మెరిశారు. శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ పతిరగె మరోసారి స్వర్ణం చేజెక్కించుకున్నాడు.
ఫైనల్లో రుమేశ్ తరంగ ఈటెను చివరి ప్రయత్నంలో 88.55 మీటర్ల దూరం విసిరి పసిడి నెగ్గగా.. యశ్‌వీర్ సింగ్ తన పర్సనల్ బెస్ట్ (85.72 మీటర్లు) నమోదు చేయడమే గాక రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఇక తొలి ప్రయత్నంలో ఈటెను 83.56 మీటర్ల దూరం విసిరిన రోహిత్ మూడో ప్రయత్నంలో 84.35 మీటర్లు విసిరి కాంస్యం దక్కించుకున్నాడు.
ఈసారి నీరజ్ చోప్రా ఆసియా క్రీడలకు దూరంగా ఉన్న నేపథ్యంలో యశ్ వీర్, రోహిత్‌లపై అంచనాలు పెరిగాయి. వారిపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ యశ్ వీర్, రోహిత్‌లు పతకాలు సాధించారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 45కు పెరిగింది. ఇందులో 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలున్నాయి. పాకిస్తాన్ స్టార్ అర్షద్ నదీమ్ 80.29 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.
ఇదీ చదవండి: Asian Games: పీటీ ఉష రికార్డు బ్రేక్.. పతకాల మోత మోగించిన భారత్


